తెలంగాణ

దుండిగల్ తండాలో శిశు విక్రయం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/జీడిమెట్ల, జూన్ 18: ఇద్దరూ ఆడ పిల్లలే.. పోషించలేమోనన్న భయంతో వారి తల్లితండ్రులు ఒక శిశువును విక్రయించినట్లు సమాచారం అందడంతో సమగ్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి లావణ్యరెడ్డి, మేడ్చల్ ఐసిడిఎస్ సూపర్‌వైజర్ స్పందన ప్రాథమిక విచారణను చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, దుండిగల్ తండా-1లో నివాసముండే నర్సింగ్ నాయక్‌కు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె సంతానం. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రెండవ కొడుకు రవీంద్రనాయక్‌కు మార్చి 8, 2014లో మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన అంజలితో వివాహం జరిగింది. వీరికి గత ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన తొలి కుమార్తె (శిరీష), ఈ ఏడాది మార్చి 14న మరో కుమార్తె జన్మనిచ్చారు. వీరిని పోషించడం తలకు మించిన భారమనుకున్న రవీంద్రనాయక్, అంజలి దంపతులు. రెండవ కూతురిని రామాయం పేట, లక్ష్మీపూర్‌లో సంతానం లేని వారికి విక్రయించినట్టు దుండిగల్ తండాలో పుకార్లు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన జిల్లా సమగ్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లావణ్యరెడ్డి, మేడ్చల్ ఐసిడిఎస్ సూపర్‌వైజర్ స్పందన, స్థానిక అండన్‌వాడీ కార్యకర్త పద్మ శనివారం రవీంద్రనాయక్, అంజలిలను కలసి విచారణ జరిపారు. ఇద్దరు కుమార్తెలు తమకు భారంగా ఉన్నందున ఒక కుమార్తెను బంధువు మధు ద్వారా లక్ష్మీపూర్‌లోని అంగన్‌వాడీ కార్యకర్తకు దత్తతకు ఇచ్చామని రవీంద్రనాయక్ అధికారులకు తెలిపాడు. కాగా, మధు ఎవరో తనకు తెలియదని అంజలి చెప్పింది. దీంతో వారి మాటలు నిజం కాదని నిర్ధారణకు వచ్చిన అధికారులు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ వ్యవహారంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు నివేదికను సమర్పిస్తామని చెప్పారు.