తెలంగాణ

భూబకాసురుల బండారం బట్టబయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, ఏప్రిల్ 18: మంజీరాలో జరుగుతున్న ఇసుక దోపిడీ బండారం ఎట్టకేలకు బయట పడింది. రాత్రిపూట టిప్పర్ల ద్వారా రవాణా చేసేందుకు పగలంతా మంజీరా నది నుంచి బయటకు తోడివేసిన కుప్పలు రెవెన్యూ అధికారుల చేతికి చిక్కాయి. బోధన్ మండలంలోని మంజీరా నది నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా పై ఆంధ్రభూమిలో వార్తాకథనం ప్రచురితం కావడంతో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బోధన్ తహశీల్దార్ రామకృష్ణ వీఆర్వోలను రంగంలోనికి దింపారు. మంజీరా శివారులో గల గ్రామాలలో ఇసుక కుప్పల గురించి ఆరా తీయగా హంగర్గా శివారులో పెద్ద ఎత్తున కుప్పలు ఉన్నట్లు విఆర్వోలు గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి పక్కా వ్యూహంతో వీఆర్వోలు, వీఆర్‌ఏలు అక్కడికి వెళ్లగా 12 టిప్పర్ల ఇసుక నిల్వలు తరలించేందుకు సిద్ధంగా ఉండటంతో వెంటనే వాటిని సీజ్ చేసి వీఆర్‌ఏలను కాపలాగా ఉంచారు. ఈ సమాచారాన్ని బోధన్ తహశీల్దార్ రామకృష్ణ ఉన్నతాధికారులకు తెలియచేసి ఇసుకను పంచనామా చేశారు. ఒకే రోజు వీఆర్వోలు దాడి చేస్తే 12 టిప్పర్ల ఇసుక నిలువలు దొరికాయంటే ఇక్కడ ఇసుక అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అధికారులను రెవెన్యూలోని క్రిందిస్థాయి ఉద్యోగులు ఏవిధంగా తప్పుదారి పట్టిస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. వీఆర్వోలు, వీఆర్‌ఏలు పకడ్బందీగా రాత్రిపూట విధులు నిర్వహిస్తే ఈ మండలంలో ఇసుక అక్రమ రవాణాకు పూర్తి స్థాయిలో కళ్లెం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బోధన్ ఏరియాలో ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.
త్వరలో ఇసుకను వేలం వేస్తాం
మండలంలోని హంగర్గ గ్రామ శివారులో సీజ్ చేసిన 12 టిప్పర్ల ఇసుకతో పాటు తహశీల్ కార్యాలయంలో ఉన్నటువంటి ఇసుక నిల్వలను త్వరలోనే వేలం వేస్తామని తహశీల్దార్ రామక్రిష్ణ తెలిపారు. ఎన్నికల బిజీ వలన ఈ కుప్పలను వేలం వేయలేక పోయామన్నారు. మంజీరా నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక అమ్మకాలకు అనుమతులు ఇస్తున్నామని అక్రమ రవాణా వలన కొందరు ధరలు పెంచేసి ప్రజలను దోచుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు రాత్రిపూట విఆర్వోలతో తనిఖీలు చేయించేలా ప్రణాళిక రూపొందించామని, అక్రమాలకు కళ్లెం వేసేందుకు రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాల్సివుంది.
చిత్రం...మంజీరా నది సమీపంలో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుక కుప్పలు