తెలంగాణ

భవిష్యత్ బిజెపిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జూన్ 19: తెలంగాణలో తెరాసను ఎదుర్కొనే సత్తా బిజెపికి మాత్రమే ఉందని ఆ పార్టీ కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. తెరాస పాలనలో పారదర్శకత లేదని తీవ్రస్థాయిలో మండిపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెరాస మంత్రులు వాస్తవాలను కప్పిపుచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కేంద్రం తెలంగాణకు అత్యధికంగా నిధులు, పథకాలు కేటాయిస్తుంటే, ఆ విషయాన్ని మరుగుపర్చి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించడం ఎంతమాత్రం మంచిదికాదన్నారు. మోదీపై విమర్శలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. తెరాస ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా అండదండగా ఉందని, రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అందిస్తున్నారంటే అందులో కేంద్రం సహకారం మర్చిపోరాదని అన్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించి అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంటే, రాజకీయాల కోసం మంత్రులు వ్యతిరేక ధోరణితో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలను తెరాస చెందిన ఎంపీలు పొగుడుతుంటే, అదే పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు విమర్శించటం రాజకీయ ద్వంద్వ విధానానికి నిదర్శనమన్నారు. ఇతర పార్టీల్లోని నేతలను ప్రలోభపెట్టి తెరాసలో చేర్చుకోవడం సిఎం కెసిఆర్ అనుసరిస్తున్న ప్రమాదకర రాజకీయ విధానాలకు నిదర్శనమన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్ చేయలేదా? అని సమర్థించుకుంటున్న కెసిఆర్, ఆ దారిలోనే పయనిస్తారా? అని దత్తాత్రేయ ప్రశ్నించారు. అడ్డదారిలో వెళ్లడం, అడ్డగోలు రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. మత దురహంకారంతో అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న ఎంఐఎం, దానితో దోస్తీ చేస్తున్న తెరాసలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాజపా శ్రేణులు నిర్మాణాత్మక పంథాలో పయనిస్తూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంఘటితం అవసరమని, ప్రజలను ముఖ్యంగా మహిళలను భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర పథకాలను అట్టడుగు వర్గాల దగ్గరకు చేరిస్తే, 2019 ఎన్నికల్లో పార్టీకి ఎదురుండదని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న పథకాలను, రాష్ట్రానికి అందిస్తున్న నిధులను జిల్లాలవారీగా దత్తాత్రేయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో బిజెపి జాతీయ నాయకులు మురళీధర్‌రావు మాట్లాడుతూ తెరాసలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందన్నారు. వనరుల దోపిడీ, గుత్త్ధాపత్యం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెరాసకు బిజెపికి చాలా వ్యత్యాసం ఉందని, రాబోయే రోజుల్లో తెరాసతో బిజెపి పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. బిజెపికి కేంద్రంలో సృష్టమైన మెజారిటీ ఉన్నా ఇతర పార్టీల నేతలను ప్రలోభపర్చి నాశనం చేయడం లేదని, కానీ తెరాస మాత్రం నిత్యం దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఇక కాంగ్రెస్‌కు ఒక సిద్ధాంతం, యంత్రాంగం లేదని, అందుకే పార్టీ కొడిగట్టే స్థితికి చేరిందన్నారు. తెలంగాణలో బిజెపి కీలక పాత్ర పోషిస్తోందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని మురళీధర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ మజ్లిస్ మతతత్వ ధోరణులను ఎదుర్కొంటామన్నారు. సిఎం కెసిఆర్ ఏ అంశంపైనా స్ధిరమైన నిర్ణయం లేకుండా, తరచూ విధానాలు మార్చుకుంటున్నారన్నారు. సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు.
కార్యక్రమనికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్.లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, శాసనసభ పక్షనాయకులు జి.కిషన్‌రెడ్డి, నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్‌తోపాటు పలువురు బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకులు, రంగారెడ్డిజిల్లా నాయకలు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అతి తక్కువ సమయంలో కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు చేసిన రంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులను పేరుపేరున ఈ సందర్భంగా అభినందించారు.

చిత్రం... బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడుతున్న జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు