తెలంగాణ

ఆపరేషన్ పైప్‌లైన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కొడిమ్యాల, జూన్ 19: 24 గంటల్లో ఆపరేషన్ పైప్‌లైన్ నిర్వహించి శెభాష్ అనిపించుకున్నారు అధికారులు. యుద్ధప్రాతిపదికన రైల్వే లైన్ తొలగించి పైప్‌లైన్ నిర్మించడమే కాకుండా, 24 గంటలు తిరగకుండానే ట్రాక్‌ను పునరుద్ధరించే ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండలం నెమలికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్‌రావు గ్రామ సమీపంలో జిగిత్యాల- కరీంనగర్ రైల్వే లైన్ మధ్య నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మాం పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు పూర్తి చేసేందుకు రైల్వే లైన్ తొలగించాల్సిన పరిస్థితి రావడంతో, నవయుగ పైప్‌లైన్ నిర్మాణ సంస్థ, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడి ప్రత్యేక అనుమతితో ట్రాక్‌ను తొలగించారు. 24 గంటల్లోనే పైప్‌లైన్ నిర్మించి, రైల్వే ట్రాక్‌నూ పునరుద్ధరించారు. దీంతో గంగాధర, కొడిమ్యాల చెరువుల నుంచి రైతుల ఆయకట్టుకు నీరు అందించడానికి అడ్డంకి తొలగిపోయింది. 50 మీటర్ల రైల్వే ట్రాక్ తొలగించి, తొమ్మిదిసార్లు బ్లాస్టింగ్ జరిపి బండరాళ్లను తొలగించి పని పూర్తి చేశారు. రోజూ ఒకసారి మాత్రమే రాకపోకలు సాగిస్తున్న జగిత్యాల -సిర్‌పూర్ కాగజ్‌నగర్‌కు వెళ్లే రైలు ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులు యుద్ధప్రాతిపాదికన ఈ పనులు చేపట్టారు. ఈ ప్రాంతానికి రైలు మార్గంగుండా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి పుణ్య క్షేత్రాలకు భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రైలు మార్గానికి ఎలాంటి అటంకాలు తలెత్తకుండా అధికారులు పనులు పూర్తి చేయగలిగారు. రాత్రి ఎనిమిది గంటలకు ఆపరేషన్ పూర్తి కాగా, రాత్రి 10.45కు ట్రాక్ నుంచి రైళ్లు నడిచాయి. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు శర్మ, పియూష్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్‌ఇ వెంకటరాములు, ఇఇపి శివకుమార్, డిఇఇ ఎంఏ రఫీ, ఎఇఇలు వి గంగాధర్‌రావు, ఉపేందర్‌రావు, ఇతర సిబ్బంది, కార్మికులు ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కరీంనగర్ ప్రాజెక్టుల సిఇ అనీల్ పర్యవేక్షించారు. అయితే, వేగంగా పనులు పూర్తి చేస్తున్న కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడి ఒకరు మృత్యువాతపడగా, మరికొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. కాగా తాగునీటి ఎద్దడి నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాణ సంస్థ సిబ్బంది పేర్కొంటోంది. ఈ పనిని మొత్తం వాట్సాప్‌లో పరిశీలించిన నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇరిగేషన్ శాఖ అధికారులను అభినందించారు.
chitram...
రైల్వే ట్రాక్ తొలగించారు.. తూము నిర్మించారు.. ట్రాక్ పునరుద్ధరించారు..