తెలంగాణ

బార్లపై బాదుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: రికార్డుస్థాయిలో రాష్ట్ర ఆదాయ వృద్ధి పెరగడానికి కారణమైన ఎక్సైజ్ శాఖ నుంచి మరిన్ని నిధులు రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా నెలాఖరుతో ముగియనున్న బార్ షాపుల లైసెన్స్‌ల స్థానే జూలైలో జారీ చేయనున్న కొత్త లైసెన్స్ ఫీజులను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బార్ లైసెన్స్ ఫీజుల పెంపుపై ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లో బార్ లైసెన్స్ ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు వెలువడవచ్చని ఎక్సైజ్ వర్గాలు చెపుతున్నాయి. లైసెన్స్ ఫీజుల పెంపుతో ప్రభుత్వానికి అదనంగా రూ.500 కోట్లమేర ఆదాయం పెరుగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రస్తుతం 766 బార్లు ఉండగా, ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో (జిహెచ్‌ఎంసి) దాదాపు సగం ఉన్నాయి. జిహెచ్‌ఎంసి పరిధిలో 370 బార్లు, మిగిలిన తొమ్మిది జిల్లాల్లో 396 బార్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా జిహెచ్‌ఎంసి పరిధిలోవున్న బార్లకు ఒక్కోదానికి ఏడాదికి రూ.55 లక్షలు వసూలు చేస్తున్నారు. వచ్చే నెలలో జారీ చేయనున్న కొత్త లైసెన్స్ ఫీజును 10 శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. ఈమేరకు జిహెచ్‌ఎంసి పరిధిలో లైసెన్స్ ఫీజు ఒక్కో బార్‌కు రూ.55 లక్షల నుంచి 60 లక్షలకు పెరుగనుందని సమాచారం. దీనివల్ల ఒక్క జిహెచ్‌ఎంసి పరిధిలోనే బార్ లైసెన్స్ ఫీజుల రూపేణా వచ్చే ఆదాయం రూ.180నుంచి 190కోట్లకు పెరుగనుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మినహాయించి ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో (వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం, కరీంనగర్) బార్ లైసెన్స్ ఫీజు 38 లక్షలు ఉండగా, దీన్ని రూ.41 నుంచి 42 లక్షలకు పెంచనున్నట్టు తెలిసింది. ఐదు లక్షల జనాభాకు లోబడిన పట్టణాల్లో ప్రస్తుతం బార్ లైసెన్స్ ఫీజు రూ.35 లక్షలుండగా, దీన్ని 38 నుంచి 39 లక్షలకు పెంచనున్నట్టు తెలిసింది. 50 వేల జనాభా కలిగిన మండల కేంద్రాలు, నగర పంచాయతీల పరిధిలో ప్రస్తుతం బార్ లైసెన్స్ ఫీజు రూ.25 లక్షలుండగా దీన్ని రూ.27 నుంచి 28 లక్షలకు పెంచనున్నట్టు సమాచారం. బార్ల లైసెన్స్ ఫీజులు పెంచడానికి ఎక్సైజు శాఖ చేసిన ప్రతిపాదన వల్ల రూ.500 కోట్లకు పైగా అదనంగా ఆదాయం సమకూరనుందని ఆ శాఖ ప్రతిపాదించింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా ప్రస్తుతం ఏటా రూ.12 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఇది నిరుటికంటే దాదాపు రూ.రెండు వేల కోట్లు ఎక్కువ. రాష్ట్రంలో పది జిల్లాల్లో రమారమీగా ఒక్కో జిల్లా నుంచి ఏడాదికి వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం అమ్మకాల పెరుగుదల అంచనాతో బార్లలో మద్యం వినియోగం కూడా పెరిగిందని, దీంతో వీటి లైసెన్స్ ఫీజులనూ 10 శాతం పెంచాల్సిందిగా ఎక్సైజ్ శాఖ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. బార్ లైసెన్స్ ఫీజు పెంచడం వల్ల పరోక్షంగా బార్లలో మద్యం సేవించే వారిపై భారం పడబోతోంది.