తెలంగాణ

ఆర్థిక శక్తితో పాటు ఆరోగ్య శక్త్తీ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఆర్థిక శక్తితో పాటు, ఆరోగ్య శక్తి కూడా దేశాభివృద్ధిలో కీలకపాత్రను పోషిస్తుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. దేశం శక్తివంతమైన దేశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని, అదే సమయంలో శక్తివంతమైన దేశం ఆరోగ్యవంతమైన దేశంగా మారుతుందని కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజారోగ్యం మీద మరింతగా దృష్టిని కేంద్రీకరించాలన్నారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు. ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తున్న మొత్తాన్ని ఇతర అభివృద్ధి కార్యక్రమాల వైపు మళ్లించి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. వత్తిడితో కూడిన జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చైతన్య రహితమైన పని విదానం తదితర అంశాలు అనారోగ్యాలకు చేరువవుతాయన్నారు. యోగ, నడక వ్యాయామం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చన్నార. భారతీయ సంస్కృతి ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అందరినీ ఆరోగ్యమస్తు ఆయుష్మాన్ భవ అని దీవించే సంప్రదాయం మనదన్నారు. స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా పేదలకు, గ్రామాలకు వైద్యం అందని దుస్థితి ఉండేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడచిన తర్వాత కూడా కొన్ని గ్రామాలకు వైద్యం అందకపోవడం విచారకరమన్నారు. వైద్యం మరింత ఖరీదుగా మారిన ఈ రోజుల్లో ఎంతో మంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. గ్రామాల్లోని పేదలకు ఉన్నత స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే స్వర్ణ్భారత్ లక్ష్యాల్లో ఒకటన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ మూడు ప్రధాన రంగాలకు పార్లమెంటు, రాజకీయ పార్టీలు, మీడియా, ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీటికి నిధులు కేటాయించాలన్నారు. మొబైల్ ఫోన్, టీవీ,కంప్యూటర్లకు అతుక్కుపోయే సంస్కృతి కూడా వత్తిడితో కూడిన జీవన విధానానికి కారణమవుతోందన్నారు. శరీరానికి సరైన కదలికలు లేకుండా ఒకేచోట కూర్చోవడం లాంటి పనుల వల్ల మానసిక ఆఅనారోగ్యాలు వస్తాయన్నారు. చైతన్య రహిత సంస్కృతికి వీలైనంత వరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలన్నారు. పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా భారతీయ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.
భారతీయ సంస్కృతి ఉన్నతమైనదని, అందరితో కలిసి పంచుకోవడం ద్వారా మన పూర్వీకులు చక్కటి జీవన విధానాన్ని గడిపారన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ ఇనిస్టిట్యూట్ సౌజన్యంతో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉచిత కేన్సర్ నిర్థారణ శిబిరాన్ని నిర్వహించిందన్నారు. సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన కేర్ హాస్పిటల్స్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, కేర్ హాస్పిటల్స్ చైర్మన్ బీ సోమరాజు ప్రసంగించారు.
చిత్రం...ఉచిత వైద్య శిబిరంలో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు