తెలంగాణ

ఫిరాయింపుల నిరోధానికి కాంగ్రెస్ వినూత్న విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులను నిరోధించేందుకు కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్ అనేక వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆదివారం ఇక్కడ గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఫిడవిట్ ఫార్మెట్‌ను ఖరారు చేశారు. పరిషత్ ఎన్నికల్లో బీ ఫారమ్‌ను పొందిన అభ్యర్థి రూ.20 ప్రమాణ పత్రం ఇచ్చే విధంగా ఒక అఫిడవిట్‌ను రూపొందించి, దానిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీలకు అందచేశారు. ఈ అఫిడవిట్‌పైన అభ్యర్థి సంతకం చేస్తారు. పోటీ చేసిన అభ్యర్థి గెలిస్తే ఐదేళ్ల పాటు పార్టీమారనని , అఫిడవిట్‌కు భిన్నంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలను తమపైనతీసుకోవచ్చని కూడా అభ్యర్థి ప్రకటించాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తే నమ్మక ద్రోహం కింద కేసు నమోదు చేయవచ్చని ప్రమాణపత్రంలో అభ్యర్థి పేర్కొంటడారు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేయాలి. జడ్పీపీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలకు తలొగ్గి ఉంటామని పేర్కొనాలి. ఈ వివరాలను పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు తెలిపారు.
మండల ప్రాదేశాక, జిల్లా ప్రాదేశిక ఎన్నికల కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు చురుకుగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లా అధ్యక్షులకు బీ ఫారమ్‌లను ఇచ్చారు. వారికి జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు బీ ఫారమ్ అందచేసే అధికారం ఇచ్చారు. ఇప్పటికే కో ఆర్డినేటర్లను నియమించారు. కాగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా స్థానిక సంస్థల ఇన్‌చార్జీగా భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పీ వీరయ్యను నియమించినట్లు పీసీసీ పేర్కొంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల నిర్వహణ తీరు ఇదేనా
ఇంటర్ పరీక్షల నిర్వహణ తీరు చూస్తుంటే రాష్ట్రప్రభుత్వం అధ్వాన్న స్థితిలో ఉందని అర్థమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అలీ షబ్బీర్ విమర్శించారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ ప్రైవేట్ ఏజన్సీలపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనకాడుతున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారన్నారు. ప్రభుత్వవ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదన్నారు. ఇంత కంటే దారుణం మరొకటి ఉంటుందా అని అడిగారు. ప్రభుత్వ తప్పిదాలపై తమ పార్టీ పోరాడుతుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.