తెలంగాణ

22 నుంచి సుందరకాండ ప్రవచనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కాచిగూడ, ఏప్రిల్ 21: సర్గీయ శ్రీమాన్ వావిలికోలను సుబ్బారావు నెలకొల్పిన కోదండరామ సేవక ధర్మ సమాజం నిర్వహకులు శ్రీమాన్ రామానుజదాస స్వామిచే ‘సుందరకాండ ప్రవచనములు’ దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక ఆధ్వర్యంలో ఈనెల 22నుంచి 24వ తేది వరకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నరసింహ రావు తెలిపారు. ఆదివారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దర్శనమ్ పత్రిక ఎడిటర్ మరుమాముల వెంటక రమణ శర్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సుముద్రాల వేణుగోపాల చారి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో కలిసి మాట్లాడారు. వావిలికొలను సుబ్బారావు వాల్మికి రామాయణాన్ని యధాతథంగా తెలుగులోకి అనువాదం చేశారని పేర్కొన్నారు. సుందరకాండ మనస్సును మురిపించే నిజమైన సౌందర్యమని వివరించారు. రామాయణం జీవన విలువలకు దర్పణం అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ప్రవచనములకు ఆథ్యాత్మిక వేత్తలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
చిత్రం...హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సుందరకాండ ప్రవచనాల
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వనం జ్వాలా నరసింహా రావు