తెలంగాణ

పునాది పడేదెప్పుడో!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంజూరైన డబుల్ బెడ్‌రూంలు 2.65 లక్షలు టెండర్లు ఖరారైనది 5.6 వేల ఇళ్లకే
రేటుపై వెనక్కి తగ్గుతున్న కాంట్రాక్టర్లు స్థానికులకు అవకాశమివ్వనున్న సర్కారు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం బాలారిష్టాల నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతోంది. హైదరాబాద్‌లో ఐడిహెచ్ కాలనీ, సిఎం దత్తత గ్రామాలు నర్సన్నపేట, ఎర్రవెల్లిలో మాడల్ ఇళ్లు తప్ప రాష్ట్రంలో
మరెక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
ప్రారంభం కాలేదు. 2.65 లక్షల ఇళ్లకు మంజూరీ లభించినా, రేటు గిట్టుబాటు కాదంటూ కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గుతుండటంతో -ఇంతవరకూ అసలు ఇళ్ళకు పునాది కూడా పడలేదు. సిఎం కెసిఆర్ ఎప్పుడు ఇళ్లు అందిస్తారా? అంటూ పేద కుటుంబాలు ఎదురు చూస్తున్నాయ.

హైదరాబాద్, జూన్ 19: తెరాస ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్షం తిరుగులేని విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం బాలారిష్టాల నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతుంది. తెరాస అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా హైదరాబాద్‌లో ఐడిహెచ్ కాలనీ, సిఎం దత్తత గ్రామాలు నర్సన్నపేట, ఎర్రవెల్లిలో మాడల్ ఇళ్లు తప్ప రాష్ట్రంలో మరెక్కడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఖరారు చేసిన రేట్లు తమకు గిట్టుబాటు కావంటూ కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తుండటమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు అంటున్నారు. ఇదే విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లగా, స్థానిక కాంట్రాక్టర్లకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని అప్పగించాలని కూడా ఇదివరకే సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోరుతూ ప్రభుత్వం పదే పదే బిడ్‌లను కోరినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో (2015-16) 65,446 ఇళ్లను, ఈ ఆర్థిక సంవత్సరంలో (2016-17) 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఈ ఏడాది మంజురు చేసిన ఇళ్లలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు, జిల్లాల్లో నిరుడు మంజురు చేసిన 65 వేల ఇళ్లతోపాటు ఈ ఏడాది మంజూరు చేసిన లక్ష ఇళ్లు కలిపి లక్ష 65 వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. వీటితోపాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి 80,481 ఇళ్లు మంజూరయ్యాయి. ఆ తర్వాత కూడా అదనంగా మంజూరు చేసిన 90 వేల ఇళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మాట అటుంచి కనీసం కేంద్రం రాష్ట్రానికి మంజురు చేసిన ఇళ్లను కూడా ప్రభుత్వం నిర్మించలేక పోతుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పదే పదే విమర్శిస్తున్నా, ప్రభుత్వం స్పందించ లేకపోతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ముందుకు సాగకపోవడంపైనే విమర్శలు గుప్పిస్తున్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. డబుల్ బెడ్ ఇళ్ల పథకంలో ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు ప్రభుత్వం రూ.900 ఖరారు చేసింది. ఎప్పుడో పదేళ్ల కిందట నిర్మాణ రంగంలో ఉన్న రేటు ప్రకారం ప్రస్తుతం ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదని, కనీసం చదరపు అడుగుకు రూ.1000 ఇస్తే తప్ప గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు తేల్చి చెబుతున్నారు. కాంట్రాక్టర్లు కోరిన విధంగా రేటు చెల్లిస్తే ఒక్కో ఇంటిపై సమారు లక్ష వ్యయం పెరుగుతుందని, దీంతో పథకానికయ్యే వ్యయం తడిసిమోపెడు అవుతుందని ప్రభుత్వం ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతుంది. పట్టణాలు, నగరాల్లో నిర్మాణ వ్యయం గిట్టుబాటు కాకున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఖరారు చేసిన రేటుకంటే తక్కువకే కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో స్థానికంగా ఉండే కాంట్రాక్టర్లకే పథకాన్ని అప్పగించాల్సిందిగా సిఎం ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.