తెలంగాణ

వచ్చే దసరా నాటికి రెండు పంటలకు గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నకోడూరు, ఏప్రిల్ 22: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని బీరప్పస్వామి దయతో వచ్చే దసరా నాటికి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు వస్తాయన్నారు. రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు అందుతాయన్నారు. స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. సోమవారం చిన్నకోడూరు మండల కేంద్రంలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నకోడూరు బీరప్ప జాతర చూస్తే కొమురవెళ్లి మల్లన్న జాతర గుర్తోస్తుందన్నారు. సిద్దిపేట నలుమూలల నుండి వచ్చి జాతరలో ప్రజలు పాల్గొనడం చాల సంతోషంగా ఉందన్నారు. గొల్లకుర్మలను గుర్తించి రాష్టస్థ్రాయిలో సముచిత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇటీవల శాసనమండలికి ఒగ్గుమల్లేశంకు అవకాశం కల్పించారన్నారు. కొమురవెళ్లి మల్లన్న దేవాలయం చైర్మన్‌కు కురుమలకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ నిర్వహాకులు హరీష్‌రావుకు గొంగడి కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమేష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... హరీష్‌రావును గొంగడితో సన్మానిస్తున్న బీరప్ప ఉత్సవాల నిర్వహకులు