తెలంగాణ

లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: న్యాయవిద్యా కళాశాలల్లో మూడేళ్ల కోర్సు, ఐదేళ్ల కోర్సు, పీజీ లాసెట్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకూ పొడిగించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు. ఇంత వరకూ మూడేళ్ల లా కోర్సునకు 12,800 దరఖాస్తులు, ఐదేళ్ల లా కోర్సునకు 3900 దరఖాస్తులు, పీజీఎల్ సెట్‌కు 1700 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ దరఖాస్తుల సంఖ్య వచ్చే వారం నాటికి మరింత పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
పరీక్ష మే 20వ తేదీ ఉదయం 11 నుండి 12.30 వరకూ జరుగుతుందని, అదే సమయంలోనే మూడేళ్ల యూజీ లా కోర్సు, ఐదేళ్ల యూజీ లా కోర్సు, పీజీఎల్‌సెట్ పరీక్ష జరుగుతుందని అన్నారు. 500 జరిమానాతో మే 3వ తేదీ వరకూ, వెయ్యి రూపాయిల జరిమానాతో మే 4వ తేదీ వరకూ, 2వేల రూపాయిల జరిమానాతో మే 13వ తేదీ వరకూ, 4వేల జరిమానాతో 16వ తేదీ వరకూ దరఖాస్తు చేయవచ్చని చెప్పారు.
ఎస్టీ లా గ్రాడ్యుయేట్లకు అవకాశం
ఎస్సీ లా గ్రాడ్యూయేట్లకు మూడేళ్లపాటు న్యాయ వ్యవస్థ అమలుపై శిక్షణ ఇస్తున్న తీరులోనే ఎస్టీ లా గ్రాడ్యూయేట్లకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్టు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ క్రిస్టియానా చొంగ్తు, డిప్యుటీ డైరెక్టర్ ఎ సభాష్‌చంద్ర గౌడ్ చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.