తెలంగాణ

విలీనం ఎలా అవుతుందో చూస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీన వివాదం ఇరు పార్టీల మధ్య చిచ్చురేపుతోంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ శాసనసభా పక్షం ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌లో ఎలా విలీనం చేస్తారో మేమూ చూస్తామని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క హెచ్చరించగా, పెద్ద పెద్ద మాటలేందుకు మీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి ముందు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని ఎద్దేవా చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌లో సీఎల్‌పీ విలీనం ఇరు పార్టీల మధ్య మాటల యుద్దానికి తెరలేపింది. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ పక్షం విలీన అంశాన్ని ప్రస్తావిస్తూ భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో పాలకపక్షానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో అంతే స్థాయిలో ప్రతిపక్షానికి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అధికారం రాష్టప్రతికి ఉంటుందన్న విషయాన్ని టీఆర్‌ఎస్ మరిచిపోవద్దని భట్టి విక్రమార్క హెచ్చరించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌లో ఎలా విలీనం అవుతుందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయ అవినీతిని ప్రోత్సహిస్తూ పక్క పార్టీలలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూస్తోన్న సీఎం అప్రజాస్వామిక చర్యలను ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని భట్టి హెచ్చరించారు. కాంగ్రెస్ చేసిన హెచ్చరికలపై తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఘాటుగా స్పందించారు. ‘పెద్ద పెద్ద మాటలేందుకు మిగిలిన మీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి చాలు’ అని హితవు పలికారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఇప్పుడే కొత్త అయినట్టు, ప్రజాస్వామ్యాన్ని తామే ఖూనీ చేసినట్టు కాంగ్రెస్ నాయకులు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలే దా? అని తలసాని నిలదీశారు. దమ్ముం టే ప్రజాస్వామ్యంలో కొట్లాడి గెలువాలన్నారు. టీఆర్‌ఎస్ పాలన బాగుండటంతో వల్లనే రెండోసారి ప్రజలు తమకు పట్టం కట్టారన్నారు. రెండోసారి కూడా అధికార పీటం దక్కలేదన్న అసహనంతో కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని ధ్వజమెత్తారు.