తెలంగాణ

పట్టణాల్లో బాలల అభివృద్ధిపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: పట్టణాల్లో బాలల విద్య, ఆరోగ్యం, భద్రత, సానిటేషన్, హైజీన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం-యూనిసెఫ్, ఏఎస్‌సీఐ మద్య అవగాహనా ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి నేతృత్వంలో సచివాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఒప్పంద పత్రాలపై సంబంధిత అధికారులు సంతకాలు చేశారు. పట్టణాల్లో బాలల అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో వర్కబుల్ ప్లాన్ రూపొందించే విషయంలో యూనిసెఫ్ సహకారం అందించేందుకు ముందుకు రావడం పట్ల జోషి సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ వ్యవహారాల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, ఏఎస్‌సీఐ డైరెక్టర్ వి. శ్రీనివాసాచార్యులు, యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ అలీ హక్‌లు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, బాలల అభివృద్ధికోసం వర్కబుల్ ప్లాన్‌ను యూనిసెఫ్, ఏఎస్‌సీఐ కలిసి వారంరోజుల్లో రూపొందించాలని కోరారు. పట్టణాల్లో బాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నిర్దిష్ట కాలపరిమితితో మైల్‌స్టోన్స్ ఏర్పాటు చేసుకుని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జోషి తెలిపారు. ఈ తరహా విధానం చేపట్టడం దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో నిలుస్తుందన్నారు. పిల్లలకు మెడికల్ కౌన్సిలింగ్, వ్యక్తిగత పరిశుభ్రత, భద్రత, రవాణా సదుపాయాలు తదితర అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. న్యూట్రిషియస్ మానిటరింగ్, ఇమ్యుమైజేషన్, డెమోగ్రాఫిక్ డటా, సంస్థాగత సౌకర్యాలు, అసెట్స్ తదితర అంశాలపై కూడా దృష్టిసారించాలని కోరారు.
వీధి బాలలకు రక్షణ కావాలి: అచ్యుత్‌రావు
పట్టణాల్లో ధీన స్థితిలో ఉన్న వీధి బాలలకు పునరావాసం, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం మొదటి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బాలల హక్కుల సంఘం ప్రతినిధి అచ్యుత్‌రావు కోరారు. సోమవారం ఒక ప్రకటన చేస్తూ, యూనిసెఫ్‌తో అవగాహనా ఒప్పందం ఎలా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పిల్లల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. బాలకార్మికులు వివిధ సంస్థలు, ఇళ్లల్లో పనిచేస్తున్నారని, వీరిని గుర్తించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నియామకం నాలుగు నెలల నుండి ప్రభుత్వం నానపెడుతోందని గుర్తు చేశారు. అక్రమ రవాణాద్వారా హైదరాబాద్ నగరానికి భారీగా బాలకార్మికులు చేరుతున్నారన్నారు. ప్రణాళికలకు పరిమితం కాకుండా పిల్లల రక్షణ పథకాలపై ప్రభుత్వం ఆలోచించాలని అచ్యుత్‌రావు సూచించారు.
చిత్రం... అవగాహనా ఒప్పంద పత్రాలను చూపిస్తున్న అధికారులు