తెలంగాణ

కేంద్రంలో కాంగ్రెస్‌కు అధికారం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్, ఏప్రిల్ 25: రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కి నియంతలా పరిపాలన కొనసాగిస్తూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాడని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సూర్యాపేట జిల్లా కట్టంగూర్‌లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రాదేశిక ఎన్నికల్లో మండలంలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రెండవసారి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్థంగా మారిందన్నారు. సర్పంచ్‌లు గెలుపొంది నాలుగు మాసాలవుతున్నా నేటికీ చెక్‌పవర్ కల్పించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడిదైనా గ్లోబరినా సంస్ధకు ఇంటర్ పరీక్షల బాధ్యతలను అప్పగించడం వల్లే తప్పిదాలు జరిగి రాష్ట్రంలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. లక్షలాదిమంది విద్యార్ధుల భవిష్యత్‌తో ఆటలాడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి తాను లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే పరిస్థితులు స్పష్టమవుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్- విజయవాడల మధ్య రైలుమార్గం నిర్మించడం తన జీవిత ఆశయమని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు సాగుతాగు నీరు అందించేందుకు చేపట్టిన బి.వెల్లంల ప్రాజెక్టును నవంబర్ నాటికి పూర్తిచేయించి సాగునీటిని అందించేలా చూస్తానని, ఇందుకోసం అవసరమైతే జాతీయరహదారిని దిగ్భంధం చేస్తాయిస్తానని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి మండలంలో జడ్పీటీసీతో పాటు 13 ఎంపీటీసీ స్థానాలు గెలుపొందాలన్నారు.
చిత్రం... కట్టంగూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి