తెలంగాణ

అగ్నిగుండంలా ఆదిలాబాద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 25: వేసవి ప్రకోపానికి జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తీక్షణమైన ఎండలకు తోడు వడగాలుల దాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం జైనథ్ మండల కేంద్రంలో రికార్డుస్థాయిలో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌లో 43.4 డిగ్రీలు నమోదైంది. ఉదయం 9 గంటలు దాటితే ఎండల దాటికి జనం ఇంటి గడప దాటి బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ పట్టణ కేంద్రాల్లో పగటి పూట జన సంచారం లేక వీదులన్నీ కర్ప్యూను తలపిస్తున్నాయి. మార్కెట్ వీధుల్లో జనం లేక పోతున్నాయి. ఇదిలా ఉంటే అగ్నిగోళంలా మండుతున్న భానుడి ప్రకోపానికి ఏజెన్సీతో పాటు మారుమూల గ్రామీణ ప్రజలు అల్లాడిపోతూ అస్వస్థతకు లోనవుతున్నారు. మండుతున్న ఎండలతో పాటు వడగాలులు ప్రజలను హైరానా పెట్టిస్తున్నాయి. ఉట్నూరు, నార్నూర్, జైనూర్ మండలాల్లో సైతం భగ భగ మండుతున్న ఎండలతో జనం వ్యవసాయ పనులకు వెళ్ళలేక పోతున్నారు. సింగరేణిలో పరిస్థితి మరింత అందోళనకరంగా ఉంది. బెల్లంపల్లి, రామకృష్ణపూర్, మందమర్రి, శ్రీరాంపూర్, చెన్నూరు మండల కేంద్రాల్లో 44 డిగ్రీలపైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం వేళల్లో పెను గాలులతో పాటు మబ్బులు కమ్ముకొని వాతావరణం చల్లబడుతుండడంతో 24 నుండి 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్ళే కూలీలు, సామాన్య రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళలేక ఇంటివద్దే ఉండాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు వడగాలుల తాకిడితో అస్వస్థతకు గురవుతున్నారు. ప్రభుత్వం పని కల్పించే చోట షామియనాలతో పాటు తాగునీటి కల్పించాల్సి ఉండగా ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే జిల్లాలో వడదెబ్బ సోకి ఎండకాలంలో 12 మంది మృతి చెందిన సంఘటన ఎండ తీవ్రతకు అద్దంపడుతోంది. సింగరేణి గనుల్లో కార్మికులు పాక్షికంగా విధులకు హాజరవుతుండడంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తి రోజు రోజుకు పడిపోతోంది. జిల్లాలో ఇప్పుడే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే మా సంలో ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు.
చిత్రం...ముసుగు ధరించి వెళ్తున్న మహిళలు