తెలంగాణ

కొంపముంచే వెబ్ ఆప్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: ఇంజనీరింగ్ అడ్మిషన్లలో అభ్యర్ధులు తమ వెబ్ ఆప్షన్లను అనాలోచితంగా ఇవ్వడం వల్ల వారు కోరుకున్న సీట్లు రాక విద్యాసంవత్సరాన్ని నష్టపోయే పరిస్థితి ఉంది. ఏపిలో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. తెలంగాణలో జూన్ 22 నుండి ఈ ప్రక్రియప్రారంభం కానుంది. ఆంధ్రాలో ఎంసెట్ వెబ్ ఆప్షన్లను మార్చుకోవడానికి కూడా తేదీలను ఖరారు చేశారు. 19, 20 తేదీల్లో ఎంసెట్ వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి సరైన సమాచారాన్ని ఇవ్వలేదని వెబ్ ఆప్షన్లను కోల్పోయిన విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెబ్ ఆప్షన్లలో జాగ్రత్తలు తీసుకోవడం ఇంజనీరింగ్ విభాగంలో చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. 31 బ్రాంచిలలో ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో కలిపి 718 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. 3,40,099 సీట్లు ఉన్నాయి, ఇందులో ఎపిలో 368 కాలేజీల్లో 1,73,634 సీట్లు, తెలంగాణలో 266 కాలేజీల్లో 1,26,468 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది తెలంగాణలో సీట్ల సంఖ్య 95 వేలు లేదా 96 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
పేరుకు 718 కాలేజీలున్నా తెలంగాణలో 30, ఆంధ్రాలో 30 వరకూ మాత్రమే అత్యుత్తమ కాలేజీలు ఉన్నాయన్నది నిపుణుల భావన. యూనివర్శిటీ, కానిస్టిట్యూయెంట్ కాలేజీలు ఏపిలో 18, తెలంగాణలో 19 ఉన్నాయి. ఇవికాకుండా మరో 30వరకూ అన్‌ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు పేరుతెచ్చుకున్నవి ఉన్నాయి. వీటన్నింటికీ ఎన్‌బిఎ గుర్తింపు ఉంది. దీంతో ఈ కాలేజీలకు గిరాకీ బాగుంది.
వీటిలో సీటు సంపాదించే క్రమంలో విద్యార్ధులు వెబ్ ఆప్షన్ల సమయంలో పొరపాట్లు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. విద్యార్ధి కాలేజీకి ప్రాధాన్యత ఇస్తున్నారో లేదా బ్రాంచికి ప్రాధాన్యత ఇస్తున్నారో ముందు తేల్చుకోవాలి, తనకు ఎంత ర్యాంకు వచ్చిందనే విషయాన్ని పక్కన పెట్టి కాలేజీకి ప్రాధాన్యత ఇచ్చే పక్షంలో వరుసగా యూనివర్శిటీ కాలేజీలు, కానిస్టిట్యూయెంట్ కాలేజీలు, ఆ తర్వాత ఎన్‌బిఎ గుర్తింపు పొందిన గ్రేడ్ ఎ కాలేజీలకు ఆప్షన్ ఇవ్వాలి. ఆ తర్వాతే గ్రేడ్ బి కాలేజీలకు, గ్రేడ్ సి కాలేజీలకు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మంచి ర్యాంకు రాలేదు కగదాని నేరుగా సి గ్రేడ్ కాలేజీలకు దరఖాస్తు చేయడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా బ్రాంచికి ప్రాధాన్యత ఇచ్చే పక్షంలో ముందు యూనివర్శిటీ కాలేజీల్లో, తర్వాత కానిస్టిట్యూయెంట్ కాలేజీల్లో, ఎన్‌బిఎ గుర్తింపు పొందిన అన్ ఎయిడెడ్ ప్రైవేటు కాలేజీల్లో ఎంపిక చేసిన బ్రాంచికి దరఖాస్తు చేసి తర్వాత ద్వితీయ ప్రాధాన్యత ఉన్న బ్రాంచిని మళ్లీ యూనివర్శిటీ కాలేజీలు, కానిస్టిట్యూయెంట్ కాలేజీలు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అపుడు ఇంజనీరింగ్‌లో తనకు నచ్చిన ఆప్షన్ సీటు పొందే వీలుందని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలి
కౌనె్సలింగ్ సమయంలో ప్రతి అభ్యర్ధి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఎమ్సెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్ వి రమణారావు సూచించారు. ఎంత తక్కువ ఆప్షన్లు ఇస్తే అంత తక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. అభ్యర్ధి మంచి కాలేజీలు, మంచి బ్రాంచిలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాలకు
భారీ వర్షసూచన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 20: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మెదక్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదవుతాయన వెల్లడించారు. ఈ నెల 22న బంగాళాఖాతం మధ్య భాగంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేస్తున్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో చిత్తూరు జిల్లా నగరిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఎనిమిది సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా తాండూరు, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో ఏడు సెంటీమీటర్లు, చిత్తూరు జిల్లా పుత్తూరు, నెల్లూరు జిల్లా తడ, రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌లలో ఆరుసెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట, మాగనూరు, చిత్తూరు జిల్లా సత్యవేడు, కడప జిల్లా పుల్లంపేట, అనంతపురం జిల్లా ధర్మవరంలలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.