తెలంగాణ

నిమ్స్’కు కొత్త హంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: నిమ్స్ ఆస్పత్రిలో లివర్, గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ టవర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నిమ్స్‌లో అధునిక బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన తరువాత మంత్రి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ, టీచింగ్ స్థాయిలో ఉన్న ఆస్పత్రుల వరకు సౌకర్యాలను మెరుగు పరిచి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం కలిగించనున్నట్టు చెప్పారు. నిమ్స్ ఆస్పత్రి స్థాయిని 1000 పడకల నుంచి 1500 పడకలకు పెంచనున్నట్టు చెప్పారు. ఎమర్జన్సీ విభాగంలో 40 నుంచి 96 పడకలకు పెంచనున్నారు. నిమ్స్‌లో ఔట్ పేషెంట్లు రోజుకు రెండువేలమంది వరకు వస్తున్నట్టు చెప్పారు. నిమ్స్ మెడికల్ కాలేజీకి అదనంగా 39 పీజీ సీట్లు వస్తున్నాయని, పీజీ హాస్టల్ భవన నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. 27 కోట్ల రూపాయలతో కొత్త పరికరాలు కొనుగోలుకు ఆదేశించామని, మరో 36 కోట్లతో కొత్త పరికరాలు కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలుస్తున్నట్టు చెప్పారు. ఉస్మానియాలో లైవ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని, బీబీనగర్ నిమ్స్‌లో త్వరలోనే ఔట్ పేషంట్ విభాగం పని చేస్తుందని చెప్పారు.

సోమవారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి