తెలంగాణ

కాళేశ్వరంపై కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. బిహెచ్‌ఇఎల్, ట్రాన్స్‌కో, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పంపు హౌజ్‌ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణీత కాల వ్యవధిని ఖరారు చేశారు. ప్యాకేజీ-6, ప్యాకేజీ 8లకు చెందిన పంపు హౌజ్‌ల నిర్మాణాన్ని 2017 జూలై నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్యాకేజీ 10,11,12 పంప్ హౌజ్‌లను 2017 సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తారు. ప్యాకేజీ 20 పంపు హౌజ్ నిర్మాణాన్ని 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారు. ఏ పనిని ఎప్పుడు పూర్తి చేయాలో ముందుగా నిర్ణయించుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో కాళేశ్వరం పంప్ హౌజ్ నిర్మాణం కార్యాచరణను అధికారులు రూపొందించి, ఏ దశలో ఏ పని పూర్తి చేయాలో నిర్ణయం తీసుకుంటారు. ప్యాకేజీ, 6, 8 కి సంబంధించి వర్క్ చార్ట్‌లను ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేశారు. పంపు హౌజ్‌లు మొత్తాన్ని 14 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, దీనిని అనుకున్న విధంగా సాధించగలమని అధికారులు తెలిపారు.
బిహెచ్‌ఇఎల్, ట్రాన్స్‌కో, అధికార యంత్రాంగం, ఆయా కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పంపు హౌజ్‌ల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టుల సిఇ, ఎత్తి పోతల పథకాల ప్రభుత్వ సలహాదారు, బిహెచ్‌ఇఎల్ ఇంజనీర్లు, ట్రాన్స్‌కో అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించాలని నిర్ణయించారు. ఈ బృందం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించి అక్కడ బిహెచ్‌ఇఎల్ లో పంపుల తయారీని స్వయంగా పరిశీలిస్తుంది.
పైపుల ద్వారా సాగునీరు
మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర ప్రాజెక్టులో పైపుల ఇరిగేషన్ విధానాన్ని అమలు చేస్తున్న సాకేత్ సంస్థ ప్రతినిధులు సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సాధారణంగా ఎక్కడైనా కాలువల ద్వారా నీటిని అందజేస్తారు. ఓంకారేశ్వర ప్రాజెక్టులో మాత్రం నీటిని వృథా చేయకుండా పైపుల ద్వారా పొలాలకు నీళ్లు వెళ్లేట్టు చేశారు. ఈ విధానం అమలు చేస్తే భూ సేకరణ సమస్య చాలా వరకు తగ్గించవచ్చునని ప్రతినిధులు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకోవచ్చునని, డిండి, సీతారామ తదితర ప్రాజెక్టులకు ఈ విధానం లాభదాయకంగా ఉంటుందని సాకేత్ ప్రతినిధులు ప్రభుత్వానికి సూచించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్టల్రో పైప్‌లైన్ ఇరిగేషన్ విధానం అమలు జరుగుతున్నట్టు చెప్పారు.

చిత్రం... బిహెచ్‌ఇఎల్, ట్రాన్స్‌కో, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ మంత్రి హరీశ్‌రావు