తెలంగాణ

నేటి నుంచి కృష్ణా బ్రిడ్జిపై రాకపోకలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాగనూర్, జూన్ 20: తెలంగాణ, కర్నాటక సరిహద్దులో కృష్ణానదిపై నిర్మించిన వంతెనకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో 40 రోజుల పాటు తెలంగాణ, కర్నాటకలకు ఈ రహదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
వచ్చేనెల జూలై 30 వరకు వంతెన పనులు కొనసాగనున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు లిఖిత పూర్వకంగా నోటిఫికేషన్ అందజేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుండి కర్ణాటక వైపు, కర్ణాటక నుండి హైదరాబాద్‌పై వెళ్ళే వాహనాలన్నీ మరికల్, ఆత్మకూర్, గద్వాల మీదుగా రాయిచూర్‌కు, లేదా హైదరాబాద్ నుండి మహబూబ్‌నగర్ గద్వాల మీదుగా రాయిచూర్‌కు వెళ్లే విధంగా దారి మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని వాహనాలు రాయిచూర్, గద్వాల మీదుగా జడ్చర్ల హైదరాబాద్‌కు వెళ్లేవిధంగా సూచించామన్నారు.
అలాగే రాయిచూర్ నుండి యాద్గీర్ వైపు వెళ్లే వాహనాలు కల్మాల మీదుగా దేవదుర్గ హట్టిగూడూరుపై యాద్గీర్ వెళ్లేవిధంగాగా సూచించినట్లు తెలిపారు.