తెలంగాణ

హైదరాబాద్‌కు పెరుగుతున్న విదేశీ యాత్రికుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: విదేశీ యాత్రికులకు ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్‌కు వచ్చే విదేశీ యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సాలీనా 12 నుంచి 13 శాతం మేరకు యాత్రికుల సంఖ్య వృద్ధి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాత్రికుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్లు తెలంగాణ పర్యాటక శాఖ అంచనా వేసింది. 2018లోనే 3.18 లక్షల మంది విదేశీ యాత్రికులు హైదరాబాద్‌ను సందర్శించారు. 2014లో ఈ సంఖ్య 75,171 ఉండేది. హైదరాబాద్‌లో చారిత్రక కట్టడాలు, ఇక్కడ ఉన్న వౌలిక సదుపాయాలు, ప్రజల మర్యాదలను చూసి విదేశీ యాత్రికులు క్యూ కడుతున్నారు. గణాంక వివరాలను విశే్లషిస్తే 2015లో 1.26 లక్షల మంది పర్యాటకులు వచ్చారు. 2016లో 1.66 లక్షల మంది, 2017లో 2.51 లక్షల మంది వచ్చారు. అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు ముత్యాల నగరమని పేరు ఉంది. హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా వివిధ దేశాలతో విమానయాన మార్గం అనుసంధానమై ఉండడం కూడా పర్యాటకుల సంఖ్య పెరగడానికి కారణమని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు.