తెలంగాణ

పంటలకు గిట్టుబాటు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు ఆహార ధాన్యాలు సరసమైన ధరకు లభించేలా సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. హైదరాబాద్ (జీడిమెట్ల) లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ లో బుధవారం నిర్వహించిన ఉద్యాన పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు వేసేలా విస్తరణ వ్యవస్థ పనిచేయాలని సూచించారు. పారిశ్రామిక అవసరాలను తీర్చే పంటల సాగుకోసం రైతులను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. అవసరమైన అన్నిచోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఒక పాలసీని రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో కొరతగా ఉన్న చింత, శాండల్‌వుడ్ సాగుకోసం ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. వర్షాధార ప్రాంతాల్లో శాండల్‌వుడ్ సాగు చేసేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. 10 లక్షల సాండల్‌వుడ్ మొక్కలను సిద్ధం చేశామన్నారు. మామిడిలో నాణ్యత, విలువల జోడింపు పెంచేందుకు రైతులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రాష్ట్రం లో సుగంధ ద్రవ్యాల పంటలకు కూడా మంచి డిమాండ్ ఉందన్నారు. స్థానికంగా సాగుకోసం సరిపడే రకాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. హరిత గృహాల్లో పళ్లతోటల పెంపకం సేంద్రీయ విధానాల్లో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్. వెంకట్రామిరెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కే. రవీదర్‌రెడ్డి, డీన్ డాక్టర్ విజయ, పరిశోధన సంచాలకులు డాక్టర్ భగవాన్‌తో పాటు ఉద్యాన శాస్తవ్రేత్తలు, మండలి సభ్యులు హాజరయ్యారు.
చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న పార్థసారథి