తెలంగాణ

ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న కేసీఆర్ ఏనాటికైనా జైలుకు వెళ్లాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మే 15: ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న కేసీఆర్ ఏనాటికైనా జైలుకు వెళ్లాల్సిందేనని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ అధ్యక్షతన పెద్దకొత్తపల్లి బస్టాండ్ సెంటర్‌లో జరిగిన రోడ్‌షోలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో నిధుల దుర్వినియోగంతోపాటు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పడిపోయేలా పాలన కొనసాగుతోందని, ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, మిషన్ భగీరథ పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచుకుంటూ, ఆ డబ్బుతో ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని సీఏం కేసీఆర్‌పై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు తదితర పథకాలలో జరిగిన లక్షా 25వేల కోట్ల రూపాయల అవినీతి గురించి ప్రశ్నించామని, వేల కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చిన ప్రభుత్వానికి డీపీఆర్ తదితర వాటిని అడిగితే సమాధానం లేదని రాబోయే రోజులలో ప్రతిపక్ష హోదాలో శాసనసభలో కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చి ప్రజాక్షేత్రానికి ఈడుస్తుందనే భయంతోనే ప్రతిపక్షం ఉండకూడదనే కృతనిశ్చయంతో కేసీఆర్ ఉన్నారని ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలతో సంపాదించిన సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ బీ ఫాంపై పోటీచేస్తే నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఓటువేసి ఎమ్మెల్యేగా గెలిపించారని, కాని ఆయన పార్టీ మారడం నియోజకవర్గ ప్రజలను మోసగించడమే అవుతుందని పైగా రాజ్యాంగాన్ని అవమానించడం అవుతుందన్నారు. ఏమాత్రం విలువలు ఉన్నా వెంటనే పార్టీ సభ్యత్వంతో పాటు పార్టీ గుర్తుపై వచ్చిన పదవికి సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలను కాపాడాల్సిన శాసనసభాపతి సైతం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుందన్నారు. పీసీసీ, సీఎల్పీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర అనంతరం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలవడంతో పాటు భారత రాష్టప్రతిని కలిసి సీఏం కేసీఆర్‌పై ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, ఒబెదుల్లా కొత్వాల్, ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కొండ మణెమ్మతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

చిత్రం... రోడ్‌షోలో మాట్లాడుతున్న సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క