తెలంగాణ

బాసరలో దేవాదాయ శాఖ ఆర్‌జేసీ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, మే 16: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంలో గురువారం రాష్ట్ర దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి విచారణ నిర్వహించారు. ప్రసాదాల తయారీ విభాగంలో అవినీతి చోటు చేసుకుంటోందని, ఆలయ ఉన్నత అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో ఏదో ఒక విషయంపై రచ్చకెక్కడం మామూలుగా మారింది. ఆలయ అధికారులే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఆలయ ఈవో కార్యాలయంలో రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి తన సిబ్బందితో కలిసి ఆలయానికి చెందిన ప్రసాదాల తయారీ రికార్డులను, అమ్మవారికి సంబంధించిన ఆలయ భూముల రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి సంవత్సరం కౌలుకు ఎంత భూమిని వేలం నిర్వహిస్తున్నారో మిగిలిన భూముల కౌలుకు ఎందుకు ఇవ్వడం లేదో వివరాలు సేకరించారు. ప్రసాదాల తయారీ విభాగంలో అవినీతి చోటుచేసుకుంటుందని, అధికారులు వాటాలు పంచుకుంటున్నట్లు ఆలయ అధికారే ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. భక్తులకు అందించే ప్రసాదాలలో ఆలయ అధికారులు చేతివాటం ప్రదర్శించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాల బరువు తక్కువచేసి విక్రయిస్తున్నారని అనుమానాలు భక్తులకు కలుగుతున్నాయి. ఆలయంలో ఈనెల 6న జరిగిన హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగి డబ్బులను దాచడానికి ప్రయత్నించారని, ఆలయ ఈవో సూచన తిరిగి ఆ డబ్బులను మేరకు హుండీలో వేశాడని, హుండీ లెక్కింపులో పాల్గొన్న ప్రైవేటు సిబ్బంది రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి దృష్టికి తీసుకువచ్చారు. ఆలయ సిబ్బందే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఆలయంలో అవినీతి రాజ్యం ఏలుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బాసర క్షేత్రంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్షాళన చేపట్టాలని కోరుతున్నారు.
అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం బాసర గ్రామస్థులు ఆలయానికి విచ్చేసిన రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణికి వినతిపత్రం అందజేశారు. ఆలయంలోని వివిధ విభాగాలలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఒకరిపై ఒకరు రీజినల్ జాయింట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఏదో ఒక వివాదంతో ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆలయ సిబ్బందిని బదిలీ చేయాలని వారు కోరారు. వాగ్దేవి సొసైటీ లేబర్లకు రెండు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. బాసర సర్పంచ్ లక్ష్మణ్‌రావు, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్, సంజీవ్‌దేశాయ్, వినయ్ దేశ్‌పాండే, సాయినాథ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... ఆర్‌జేసీ కి వినతిపత్రం అందజేస్తున్న స్థానికులు