తెలంగాణ

ధర్మపురిలో ఘనంగా షోడశోపచార పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మే 16: ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ నవరాత్రి ఉత్సవాలలో అంతర్భాగంగా గురువారం ఉదయం ధర్మపురి దేవస్థానంలో ప్రత్యేక పూజాధికాలను నిర్వహించారు. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు రాత్రి మొదటి జామున పునర్వసు నక్షత్రంలో ఆరు గ్రహాలు ఉచ్ఛస్థితి యందుండగా పరశురాముడు జన్మించాడు. విష్ణుమూర్తి దశావతారాలలో ఆరవ అవతారమైన పరశురాముని జయంతిగా కూడా భావించే సందర్భాన్ని పురస్కరించుకుని, దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర నారసింహాలయాలలో గురువారం ప్రత్యేక అర్చనలను సనాతన సంప్రదాయ వేదోక్త రీతిలో నిర్వహించారు. దేవస్థానం డిసి, ఇఓ అమరేందర్ పర్యవేక్షణలో, చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మకర్తల భాగస్వామ్యంతో, ప్రధానాలయాల అర్చకులు శ్రీనివాసాచార్య, నరసింహమూర్తి, హరినాథాచార్య, అశ్విన్ కుమార్, మోహన్, విజయ్, వంశీ, కిరణ్‌ల ఆధ్వర్యంలో వేదవిదులు సంతోష్ శర్మ, సంపత్ శర్మ, రాజగోపాల శర్మ, తదితరులు శ్రీసూక్త, లక్ష్మీసూక్త, కల్పోక్త న్యాస పూర్వక పంచోపనిషత్ యుక్త అభిషేకాలు, షోడశోపచార సహిత లక్ష్మీనరసింహ సహస్ర అష్టోత్తర నామార్చనాది విదివిధాన పూజలు చేశారు. పవిత్ర గోదావరి జలాలతో స్వాములను అభిషేకించి, ఉపనిషత్ మంత్రాలతో విధివిధాన అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించారు. లక్ష్మీసూక్త సంపుటీకరణ, లలిత, విష్ణు సహస్రనామార్చనలు చేసి, ఏక, ద్వయ, త్రయ, పంచ, నాగ, నక్షత్ర, కుంభ, కర్పూర, సప్త హారతులు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, తీర్థ ప్రసాద వితరణలు చేశారు.
వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అధిక సంఖ్యాక భక్తులు, క్షేత్రవాసులు ఉత్సవ ప్రత్యేక పూజాదులలో పాల్గొని కన్నులారా చూసి తరించారు.

చిత్రం... యోగానంద నారసింహాలయంలో ప్రత్యేక నవరాత్రి పూజాధికాలు