తెలంగాణ

ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు నెల రోజులు ఆలస్యంగా జూన్, జూలై నెలల్లో నిర్వహించాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదన సరైనది కాదని, ఈ విషయమై తమ అభ్యంతరాలు తెలియచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గురువారం ఇక్కడ గాంధీ భవన్‌లో డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ నెల 23వ తేదీన పార్లమెంటు ఎన్నికలు వెలువడనున్నాయి. 27వ తేదీన పరిషత్ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాజకీయ వ్యూహాలపై ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో చర్చించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎంపీపీ, జడ్పీపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మూడు రోజుల్లోగా చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు చేయాలన్నారు. లేనిపక్షంలో బేరసారాలకు, డబ్బురాజకీయాలు, క్యాంపుల నిర్వహణకు అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించరాదన్నారు. ఈ నెల 21వ తేదీన దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై శే్వతపత్రం విడుదల చేయాలి
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై శే్వతపత్రాన్ని విడుదల చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన 2.80 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పిన కేసీఆర్, ఇంతవరకు 16,370 ఇళ్లను మాత్రమే నిర్మించారన్నారు. 94 శాతం లబ్థిదారులు వేచి చూస్తున్నారన్నారు. కేసీఆర్ ఇళ్ల నిర్మాణంపై సమీక్షలు చేయడం లదేదన్నారు.