తెలంగాణ

మెదక్ విజయంతో బాధ్యత పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మే 23: మెదక్ లోక్‌సభకు ప్రజలు అత్యధిక మెజార్టీని తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. నర్సాపూర్ బీవీఆర్‌ఐటి కళాశాలలో జరిగిన కౌంటింగ్ కేంద్రంలోని మీడియా ఛాంబర్‌లో గురువారం సాయంత్రం మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలకు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిని కలిసికట్టుగా గెలిపించేందుకు కృషి చేశామని ఆయన వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు సీఎంపై సంపూర్ణ అభిమానంతో ఎంపీకి మెజార్టీ తెచ్చారన్నారు. దీంతో బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. అంకితభావంతో తెరాస బృందాలు పనిచేశాయని తెలిపారు. జిల్లా ప్రజలు ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా సంపూర్ణమైన ఆదరణ అందించారని, దీవెనలు ఇచ్చారన్నారు. కాగా ప్రజలకు అంకితభావంతో దీక్షతో సేవలు చేయడానికి ముందుంటామని ఆయన ప్రకటించారు. ఈ విజయం తెరాస కార్యకర్తలది, ప్రజలదన్నారు. మూడు లక్షల మెజార్టీ వస్తుందని అంచన వేశామని, కానీ మూడు లక్షలపైన మంచి మెజార్టీ ప్రజలు అందించారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మూడు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంటామని ఆయన తెలిపారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో 50 వేల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. కానీ ప్రజలు అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చారన్నారు. సీఎం చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన ప్రజల మంచి మెజార్టీ ఇచ్చారన్నారు. కాళేశ్వరం నీళ్లతో జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ ఎన్నిక ఎమ్మెల్యేలపై బాధ్యత పెరిగిందన్నారు. కేసీఆర్ ఆశీస్సులు, హరీష్‌రావు ప్రోత్సహంతో ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, చింత ప్రభాకర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సీఎం, రామలింగారెడ్డి, కేటీఆర్‌ల సహకారంతో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆశించిన దానికంటే అత్యధిక మెజార్టీ సాధించామని తెలిపారు. ఏడు నియోజకర్గాలకు హరీష్‌రావు సారథ్యం వహించారన్నారు. ఎన్ని జన్మలెత్తినా ప్రజల రుణం తీర్చుకోలేరని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సీఎం ఆలోచిస్తున్న బంగారు తెలంగాణలో భాగస్వాములై కేంద్ర నిధులు రాబట్టుకొని మెదక్ జిల్లాను అభివృద్ది పరుస్తానని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. ప్రజలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందని ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి మాజీ మంత్రి సునీతారెడ్డి మీడియా సమావేశ మందిరంలో శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.