తెలంగాణ

దేవాలయ భూముల పరిరక్షణకు టాస్క్ఫోర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, అర్చకుల వేతనాలు పెంచడంతో పాటు ఈ శాఖను మరింత బలోపేతం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. మంత్రి వర్గ ఉప సంఘం శుక్రవారం సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న ఆలయ భూములను పరిరక్షించేందుకు దేవాదాయ, రెవిన్యూ, టౌన్ ప్లానింగ్, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడానికి మంత్రి వర్గ ఉప సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రధానంగా దేవాదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటంతో పాటు వాటి ద్వారా వచ్చే ఆదాయ మార్గాలపై కూడా దృష్టిసారించాలని సమావేశం నిర్ణయించింది. ధూప దీప నైవేద్య పథకం ద్వారా ప్రస్తుతం 1800 ఆలయాల్లో అర్చకులకు రూ.6000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారని, అయితే ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వస్తున్న విన్నపాల మేరకు మరిన్ని దేవాలయాలను ఈ పథకం కింద చేర్చాలని మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆదాయాన్ని బట్టి ఆలయాలను అప్ గ్రేడ్ చేయడంపై ప్రణాళికను రూపొందించాలని ఉప సంఘం అధికారులను ఆదేశించింది. ఆలయ ఉద్యోగులు, అర్చకుల వేతనాలు చెల్లించడానికి అత్యున్నత మార్గం ఏదైతే బాగుంటుందని సమావేశంలో చర్చించారు. ఉద్యోగులకు, అర్చకులకు వేతనాలు పెంచడంతో పాటు అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ నిధి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. అర్చకులు, ఉద్యోగులతో విధిగా మంత్రివర్గ ఉప ఉంఘం సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఆలయ భూములు, అన్యాక్రాంతం, తిరిగి స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలపై ఉప సంఘం సుదీర్ఘంగా చర్చించింది. ఆలయాల ఆదాయం పెంచడమే కాకుండా భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను పెంచడంపై దృష్టి సారించాలని మంత్రివర్గ ఉప సంఘం సూచించింది. ఉద్యోగులు, అర్చకుల నియామకానికి ఇక నుంచి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయాలని ఉప సంఘం అధికారులను ఆదేశించింది. వచ్చే నెల మూడవ వారంలో మరోసారి ఉప సంఘం భేటీ కావాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఉప సంఘం సభ్యులు మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.