తెలంగాణ

పంచాయతీ చట్టంలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్, వైస్-చైర్‌పర్సన్, మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల కోసం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు తొలుత ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరిగిన వెంటనే జడ్పీపీ చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత మొదటి సమావేశం 2019 జూలై 4 తర్వాత నిర్వహించేందుకు వీలుగా చట్టంలో తాత్కాలికంగా మార్పు తీసుకురావలసి ఉంది. ప్రస్తుతం ఉన్న పాలక మండళ్ల కాలపరిమితి 2019 జూలై 3 (ఖమ్మం జిల్లా మినహా) వరకు ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 6, 10, 14 తేదీల్లో మూడుదశల్లో జరిగాయి. ఈ నెల 27 న ఓట్ల లెక్కింపు చేస్తామని తొలుత రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల ఈ తేదీన లెక్కింపు చేయడం లేదు. జూన్ 20-25 తేదీల మధ్య ఓట్ల లెక్కింపు చేసి, ఆ వెంటనే జడ్పీపీ చైర్‌పర్సన్, వైస్-చైర్‌పర్సన్, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల తర్వాత పదవీ స్వీకారానికి వారం పదిరోజుల సమయం ఉంటుంది. ఈ పరిస్థితిలో చట్టప్రకారం ఎలాంటి ఇక్కట్లు ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అవసరమైతే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఈ అంశంపై తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఎస్‌ఈసీ అధికారులు పలుదఫాలుగా సమావేశమైన తర్వాత పాలనాపరమైన అంశాలపై విధాన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా అధికారులు ఈ అంశంపై చర్చించారని తెలిసింది.