తెలంగాణ

తెరాస అంతర్మథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రభుత్వంతో పాటు పార్టీ పనితీరుపై దృష్టి సారించనుంది. కేటీఆర్ ఇప్పటికే వర్కింగ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, ఆశించినట్లుగా సీట్లు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత అనేక వారాల విరామంతో ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో కేటీఆర్‌కు చోటు కల్పించకుండా వర్కింగ్ అధ్యక్షుడిగా నియమించారు. కానీ టీఆర్‌ఎస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేయాలన్న సంకల్పంతో ఉన్న రేవంత్ రెడ్డి మల్కాజగిరి నుంచి గెలిచారు. కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత ఓటమి చెందారు. అన్నింటికీ మించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు సంపాదించిన బీజేపీ ఈసారి నాలుగు లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. కోమాలోకి జారుకుందనుకున్న కాంగ్రెస్ పార్టీ లేచి కూర్చుంది. ఎకాఎకిన మూడు సీట్లు నల్లగొండ, భువనగిరి, మల్కాజగిరిలో కాంగ్రెస్ గెలిచి ఊపిరిపోసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ ఉత్తర తెలంగాణలో జెండా ఎగురవేస్తే, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గింది. దీంతో టీఆర్‌ఎస్ అధినాయకత్వం బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, ఓటమి కారణాలపై అంతర్మథనం ప్రారంభించింది. బీజేపీకి జాతీయ స్థాయిలో తిరుగులేని మెజార్టీ రావడంతో ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనకు కేసీఆర్ రాంరాం చెప్పేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలపై లోక్‌సభలో ఉమ్మడిగా పోరాడేందుకు 22 సీట్లున్న జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్న నిర్ణయం కంటే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిని సారించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో పార్టీ పరంగా మెరుగైన ఫలితాలు సాధించడంలో విఫలమైన మంత్రులపై టీఆర్‌ఎస్ అధినాయకత్వం అసంతృప్తితో ఉంది. సారూ, కారూ, పదహారు నినాదం బెడిసికొట్టింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు సికింద్రాబాద్ సీట్లను గెలుచుకుంది. ఆదిలాబాద్ లోక్‌సభ సీటులో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు గెలిచారు. ఇక్కడ నిర్మల్ అసెంబ్లీ సీటులో బీజేపీకి 14వేల మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక సికింద్రాబాద్ సీటులో సనత్‌నగర్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదాసీన వైఖరి వల్ల లేదా ప్రజల్లో ఉన్న అసంతృప్తి వల్ల బీజేపీకి 14 వేల ఓట్ల ఆధిక్యత లభించింది. ఇక్కడ మంత్రి కుమారుడు సాయికిరణ్ పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి చెందారు. మహబూబ్‌నగర్ సీటులో టీఆర్‌ఎస్ గెలిచినా, అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీకి 4వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ పార్లమెంటు పరిధిలో బాల్కొండ అసెంబ్లీ పరిధిలో బీజేపీకి 11వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ అసెంబ్లీ నుంచి మంత్రి వీ ప్రశాంత రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్లగొండ సీటును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలుచుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో మంత్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీల వారీగా చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సొంతంగా 88 సీట్లు వచ్చాయి. కానీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశే్లషిస్తే టీఆర్‌ఎస్‌కు 119 నియోజకవర్గాల్లో 66 చోట్ల మెజారిటీ వచ్చింది. అంటే మూడు నెలల్లో 22 నియోజకవర్గాల్లో మెజారిటీ తగ్గింది. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పాగా వేశాయి. ఇది ఒక రకంగా టీఆర్‌ఎస్‌కు ప్రమాద ఘంటికలు మోగినట్లే అంటున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగున్నరేళ్లు గడువు ఉన్నందు వల్ల ఆలోగా మార్పులు వస్తాయి. బీజేపీకి ఒక సీటు మాత్రమే నగరంలో గోషామహల్‌లో వచ్చింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశే్లషిస్తే 21 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి ఆధిక్యత వచ్చినట్లు గణాంక వివరాలు చూస్తే విదితమవుతుంది. కాంగ్రెస్‌కు కేవలం 19 సీట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చాయి. అదే లోక్‌సభ ఎన్నికల్లో 22 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చింది. ఇందులో 14 అసెంబ్లీ సీట్లు నల్లగొండ, భునవగిరి, మల్కాజగిరి లోక్‌సభ సెగ్మెంట్లలో ఉన్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీజేపీ గణనీయంగా లాభపడగా, కాంగ్రెస్ మాత్రం చేవెళ్ల, జహీరాబాద్ లోక్‌సభ సీట్లలో ఇంకాస్త శ్రమపడి ఉంటే గెలిచి ఉండేవారమని మదనపడుతున్నారు.