తెలంగాణ

తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మిక యూనియన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: తెలంగాణ ఆర్టీసీ కార్మిక యూనియన్లు గుర్తింపు యూనియన్ కోసం సమాయత్తం అవుతున్నాయి. యూనియన్ ఎన్నికలు నిర్వహించడానికి కార్మిక శాఖ సంకేతాలు ఇచ్చింది. దీంతో గుర్తింపు యూనియన్ కోసం దాదాపు 10 యూనియన్లు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. వచ్చే జూలై నెలలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించడానికి సంకేతాలు ఇచ్చినట్లు ఆర్టీసీ అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండేళ్ళకు ఒకసారి ఆర్టీసీలో గుర్తింపు కార్మిక యూనియన్ కోసం ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ ఎన్నికలను కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటుంది. ప్రధానంగా గుర్తింపు యూనియన్ కోసం మూడు యూనియన్లు పోటీలో ఉన్నాయని కార్మిక నేతలు చెబుతున్నారు. గుర్తింపు ఎన్నికల కోసం 10 యూనియన్లు గెలుపుకోసం ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయు, టీజెఎంయు యూనియన్లు మధ్య పోటీ ఉంటుందని కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికార యూనియన్ టీఎంయు మళ్ళీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనికి ధీటుగా ఎంప్లాయిస్, టీజేఎంయు యూనియన్లు ఎన్నికలుకు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఆర్టీసీలో దాదాపు 52 వేల పైచిలుకు కార్మికులు పని చేస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ తెరాస మద్దత్తుతో గడచిన ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికుల పక్షాన టీఎంయును కార్మికులు గెలిపించారు. 2018 ఆగస్టు 7వ తేదీ నాటికి ప్రస్తుతం గుర్తింపు యూనియన్ టీఎంయు పదవీకాలం ముగిసింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వరుసగా స్థానిక పంచాయతీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఆర్టీసీ కార్మిక యూనియన్ ఎన్నికలు వాయిదా పడుతూవచ్చాయి. గుర్తింపు యూనియన్ టీఎంయు పదవీకాలం ముగిసి దాదాపు10 నెలలు పూర్తి అయ్యింది. దీంతో యూనియన్ ఎన్నికలు జరిపించాలని 10 యూనియన్ కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికైన టీఎంయు పదవీకాలం ముగియడంతో కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని యూనియన్ నేతలు కనె్నర్ర చేస్తున్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నించే యూనియన్ లేకపోవడంతో కార్మిక సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల పదవీ విరమణ పూర్తి అయినప్పటికీ వారికి చెందాల్సిన సౌకర్యాలు అందడంలేదని యూనియన్లు వాపోతున్నాయి. ఆర్టీసీ నష్టాలకు అధికార పార్టీ తెరాసనే బాధ్యత వహించాలని కార్మిక యూనియన్లు నిలదీస్తున్నాయి. ఆర్టీసీలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని ఎంప్లాయిస్ కార్మిక యూనియన్ నేత రాజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించనందున కార్మిక సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు నిబద్దతతో పని చేస్తున్నందున ఆర్టీసీ సంస్థ మనుగడ సాధిస్తున్నదని ఆయన గుర్తు చేశారు. కార్మికులు ఆర్టీసీ కోసం పని చేస్తంటే ప్రభుత్వం దొడ్డిదారిన ప్రైవేట్ సంస్థలకు పర్మిట్‌లు ఇవ్వడం ఏమిటని ఆయన నిలదీశారు. ప్రతియేటా వందలాది మంది కార్మికులు పదవీ విరమణ చేస్తున్నారన్నారు. అయితే ఖాళీ అవుతున్న ఉద్యోగాలను యాజమాన్యం భర్తీ చేయడం లేదన్నారు. దీంతో ఉన్న కార్మికులపై భారం అధికమవుతోందని రాజరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరో కార్మిక యూనియన్ టీజెఎంయు జనరల్ సెక్రటరీ హనుమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ గుర్తింపు యూనియన్ టీఎంయూ పదవీ కాలం ముగియడంతో కార్మిక సమస్యల పట్ల స్పం దించే అధికారులు కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశా రు. కార్మిక యూనియన్ల ఎన్నికలు వాయిదా వేయకుండా తక్షణం ఎన్నికలు జరిపించాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ గంగాధర్‌కు వినితిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. గత రెండేళ్ళుగా కార్మికులకు దక్కాల్సిన వేతన సవరణ పూర్తి కాకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు రాత్రి డ్యూటీలు చేస్తుంటే కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో అనారోగ్యాలకు గురిఅవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.