తెలంగాణ

ఎన్నికల ‘కోడ్’ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: లోక్‌సభ ఎన్నికలు పూర్తయినందు వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కాండక్ట్) రద్దు చేశామని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి ‘కోడ్’ అమల్లో ఉంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుందని ఈసీఐ గతంలో ప్రకటించింది. తెలంగాణతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కోడ్ అమలయింది. దేశం మొత్తంలో లోక్‌సభ ఎన్నికల కార్యక్రమం పూర్తయినందువల్ల ఈసీఐ ప్రకటించిన కోడ్‌ను రద్దు చేస్తున్నామని, దాంతో కోడ్ రద్దు వెంటనే అమల్లోకి వచ్చినట్టేనని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు లేఖలు పంపించారు. అంటే ప్రభుత్వాలు ఇక నుండి ఉద్యోగుల బదిలీలు, సీఎంలు, మంత్రుల ప్రయాణాలు, ఉద్యోగుల ప్రమోషన్లతో పాటు కొత్తపథకాల ప్రకటన తదితర పనులు చేపట్టేందుకు వీలవుతుంది.