తెలంగాణ

రైల్వే కుటుంబాల పిల్లలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగ యువతీయువకులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణా తరగతులను నిర్వహించడానికి రైల్వే అధికారులు సిద్ధం అవుతున్నారు. రైల్వేలో ఇలాంటి కార్యక్రమాలు గతంలో నిర్వహించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ శిక్షణా తరగతులను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు రైల్వే సీపీఆర్ సీహెచ్ రాకేశ్ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. వీటి కోసం గుంతకల్ డివిజన్ ఆఫీస్ కార్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఈ కోర్సుల్లో ప్రధానంగా మల్టీస్కిల్ ఎలక్ట్రీషియన్, కంప్యూటర్, హాస్పిటాలిటీ కోర్సులకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణ తరగతులు జూన్‌లో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మే 30 వ తేదీ చివరి గడువుగా ఆయన చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ 2019 అన్న వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు పొందవచ్చునని చెప్పారు. ఈ శిక్షణ తరగతులు అన్ని ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయన్నారు.