తెలంగాణ

తెలంగాణ యువతకు ఉచితంగా అపెరల్ ట్రైనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ యువతకు ఉచితంగా అపెరల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు అపెరల్ ట్రైనింగ్ డిజైన్ సెంటర్ డైరెక్టర్ రవికిశోర్ తెలిపారు. ఏడాది డిప్లొమో కోర్సులు ఆఫర్ చేస్తున్నామని, అపెరల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీలను అభ్యసించదలుచుకున్న మహిళా విద్యార్థులు కోసం యుఎస్‌ఎకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్ జీఏపీ సంస్థ సహకారంతో 50 మంది విద్యార్థినులకు మెరిట్ కమ్ మీన్స్ ప్రీ - స్కాలర్‌షిప్‌తో శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థినులను ప్రోత్సహించేందుకు జీఏపీ సంస్థ ముందుకు వచ్చిందని, 12వ తరగతి 60 శాతం అంతకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. వార్షిక ఆదాయం 2.50 లక్షలకు మించని వారే అర్హులని చెప్పారు. అపెరల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్ భాతర ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖ ఆధీనంలోని అపెరల్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ ఆధీనంలో పనిచేస్తోందని అన్నారు. ఏటీడీసీ ఫ్యాషన్ డిజైన్ అపెరల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్, రిటైల్ అండ్ అపరల్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఎంట్రిప్రిన్యూర్‌షిప్ లో మూడేళ్ల వొకేషనల్ కోర్సును అందిస్తోందని చెప్పారు. ఈ కోర్సులో చేరేవారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలని, ప్రవేశరుసుం సెమిస్టర్‌కు 33500 రూపాయిలు చెల్లించాలని, ఆరు సెమిస్టర్లు ఉంటాయని పేర్కొన్నారు. ఎటీడీసీ ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ, అపరల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ డిప్లోమోను కూడా ఈ సంస్థ ఆఫర్ చేస్తోందని అన్నారు. ఈ కోర్సులో చేరేవారు 45వేల రూపాయిలు ఫీజుగా చెల్లించాలని అన్నారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పూర్తి ఆశ్రయ స్థాయి ఉచిత శిక్షణ పొందాలంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల యువతకు ఇవి గొప్ప అవకాశమని చెప్పారు. ఆరు నెలల శిక్షణ అనంతరం 14వేల రూపాయిలు లేదా అంతకు మించిన ప్రారంభ వేతనంతో రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమల్లో ప్లేస్‌మెంట్ ఉంటుందని, ఈ కోర్సును తెలంగాణ ప్రభుత్వ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ సహకారంతో భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ డీడీయుజీకేవై పథకంలో భాగంగా అమలుచేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం రెండో బ్యాచ్ శిక్షణ పొందుతోందని, మూడో బ్యాచ్‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, ఇతర వివరాలకు మాదాపూర్ ఆవాసా హోటల్ ఎదురుగా ఉన్న ఏటీడీసీ వొకేషేనల్ ఇనిస్టిట్యూట్‌లో సంప్రదించాలని రవికిశోర్ చెప్పారు.