తెలంగాణ

మహిళా హక్కులు కాలరాస్తున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మహిళా సాధికారత కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలేదని, పైగా మహిళా హక్కులను కాలరాస్తోందని భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ కొనెనికా రాయ్ ఆరోపించారు. శనివారం మహిళా సమాఖ్య తెలంగాణ అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొనెనిరాయ్ మాట్లాడుతూ చట్టసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం చిత్తశుద్ధితో లేదని, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు జరుగుతున్నా చట్టాల అమలులో పాలకులు విఫలమవుతున్నారని ఆమె నిశితంగా విమర్శించారు. నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని, మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చి అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కళావతి, సృజన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని, తన మంత్రివర్గంలో ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పొదుపు సంఘాలకు సరైన ప్రోత్సాహం కల్పించడంలేదని, బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించడంలేదన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని వారు డిమాండ్ చేశారు.

చిత్రం శనివారం మహిళా సమాఖ్య నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తున్న
జాతీయ మహిళా సహాయ కార్యదర్శి డాక్టర్ కొనెనికా రాయ్