తెలంగాణ

దాడులను రాష్ట్రపతికి నివేదిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, జూన్ 15: తెలుగు రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల గురించి రాష్ట్రపతికి నివేదిస్తానని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో దళిత మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం గురించి తెలుసుకునేందుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మెదక్ జిల్లాలో పటాన్‌చెరువులో 16 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్, అదే విధంగా కడప జిల్లాలో ఐఐఐటీలో పని చేసే దళిత యువతికి పదోన్నతి జరగకుండా మానసిక వేధింపులు, గత ఏడాది మిర్యాలగూడలో అగ్ర కుల యువతిని వివాహం చేసుకున్న దళిత యువకుడు ప్రణయ్ హత్య, ఇటివల మిర్యాలగూడలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో దాడులపై చర్చించి తదుపరి చర్యలపై ఆదేశిస్తానని పేర్కొన్నారు. మొత్తం మీద దాడుల నివారణకు కమిషన్ నిత్యం పని చేస్తుందన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జగన్నాధరావు, డీఎస్‌పీ పీ.శ్రీనివాస్, ఎస్‌సీ కార్పోరేషన్ ఈడీ వినోద్‌కుమార్, ఐసీడీఎస్ జిల్లా అధికారి కృష్ణవేణి, స్థానిక అధికారి మమత, తహసీల్దార్ కార్తిక్, బీజేపీ నాయకులు ఆర్.పురుషోత్తంరెడ్డి, బంటు సైదులు తదితరులు పాల్గొన్నారు.