తెలంగాణ

దయనీయంగా కోయిల్‌సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, జూన్ 15: మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే మధ్యతరహ ప్రాజెక్టు కోయిల్‌సాగర్ నిర్వహణపై పాలకులు, అధికారులు, తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఏటా ప్రాజెక్టు నిర్వహణ పనులకు నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికి చిల్లి గవ్వయినా విడుదల చేయని దుస్థితి నెలకొంది. దీంతో ప్రాజెక్టు వద్ద దీపాలు సైతం వెలగడం లేదు. ప్రాజెక్టుపై పర్యాటకులు నడిచి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన నడక దారి గుంతలమయమైంది. ప్రాజెక్టు వద్ద కనీస మరమ్మత్తులు చేపట్టేందుకు సైతం నిధులు లేకపోవడంతో నిర్వహణ బారంగా మారింది. కోయిల్‌సాగర్ జలాశయం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలోని దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, మరికల్ మండలాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు నారాయణపేట, కొడంగల్, మండలాల్లోని గ్రామాలు, మహబూబ్‌నగర్ పట్టణానికి తాగునీటి అవసరాలు తీరుస్తోంది. జూన్ నెల చివరిలో జూరాల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులోకి నీటిని తరలించే అవకాశం ఉంటుంది. నీటిపారుదల శాఖ అధికారులు ఆలోపు ప్రాజెక్టు వద్ద నిర్వహణ పనులకు చర్యలు తీసుకోవాలి. జూన్ నెలలో రెండువారాలు పూర్తి అయినా అధికారులు కనీసం స్పందించడం లేదు. ప్రాజెక్టు గేట్లకు రంగులు వేయకపోవడంతో తుప్పుపడుతున్నాయి. ప్రాజెక్టు వద్ద ఉన్న సీసీ రోడ్ల దుస్థితి ఆధ్వాన్నంగా మారింది. ప్రాజెక్టు షటర్ల వద్ద పిచ్చిమొక్కలు పెరుగుతుండటంతో నెర్రలు వచ్చే ప్రమాదం నెలకొంది. దీంతో అయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిత్రం... ప్రాజెక్టు షట్టర్లపై పిచ్చిమొక్కలు