తెలంగాణ

కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 25: మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన వింజమూరు, గొండ్యాల్, వేపూర్, కోత్లాబాద్ వాగులు పొంగిపొర్లుతుండడంతో కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చింది. వరద కారణంగా శనివారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 9 అడుగులకు చేరింది. మూడు రోజుల క్రితం ప్రాజెక్టులో నీటిమట్టం 6.5 అడుగుల మేరకు ఉండేది. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు సంబంధించిన వాగులు పారుతుండడంతో వరద ఉధృతి కొనసాగుతోంది. 32 అడుగుల కెపాసిటీ గల కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో జూన్‌లో ఎన్నడూ లేనివిధంగా వరద రావడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదట కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలోనే వర్షాధార ప్రాజెక్టుగా నిర్మించారు. కానీ ప్రస్తుతం కృష్ణా జలాలను జూరాల ప్రాజెక్టు నుండి బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోసి ప్రాజెక్టును నింపే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జూరాల బ్యాక్ వాటర్ ఎత్తిపోయకముందే ఈ సీజన్‌లో వర్షానికి కురిసిన నీటితో ఎగువ ప్రాంతంలోని చెరువులు, కుంటలు అలుగులు పారుతుండడంతో ఒక్కసారిగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. గంటగంటకూ కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతూ వస్తోంది.

మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు జలకళ