తెలంగాణ

చైన్ స్నాచర్ల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: జంట నరాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ డిసిపి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నిందితులు రెండు నిందితులు రెండు బృందాలుగా ఏర్పడి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. వారి నుంచి 91 తులాల బంగారు ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరిపై జంటనగరాల్లోని పలు పోలీసు స్టేషన్లలో 22 కేసులు నమోదై ఉన్నట్టు తెలిపారు. ఓ ముఠాలోని సభ్యులు మహమ్మద్ మోహిసిన్ అలీ షా, సయ్యద్ జమీల్ హుస్సేన్, ఖాజా ఫరీదుద్దీన్ ఖాద్రి, ముస్త్ఫా ఖాన్‌లను అరెస్టు చేసి వారి నుంచి 77.8 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్టు డిసిపి వై లింబారెడ్డి వివరించారు. అదేవిధంగా మరో ముఠాలోని సభ్యులు ఫరీదుద్దీన్ ఖాద్రి, ముస్త్ఫాలను అరెస్టు చేసి వారి నుంచి 13.1 తులాల బంగారు ఆభణాలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కాగా వీరిపై జంటనగరాల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో 22 చోరీ కేసులు నమోదై ఉన్నట్టు డిసిపి వివరించారు. వీరిపై కేసులు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం పంజగుట్ట పోలీసులకు అప్పగించినట్టు డిసిపి పేర్కొన్నారు.

చిత్రం పోలీసుల చేతికి చిక్కిన చైన్ స్నాచింగ్‌ల ముఠా