తెలంగాణ

కేంద్రంలో హిట్లర్, రాష్ట్రంలో నిజాం పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: కేంద్రంలో బీజేపీ , రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికార పక్షాలు నియంతృత్వానికి బిందువుగా మారాయని ఫలితంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. సోమవారం నాడు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నగర సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పాలన నుండి నిరంకుశ పాలన వైపు కేసీఆర్ అడుగులు వేస్తున్నారని దానికి నిరసనగా వెనక్కు నడుస్తూ ప్రదర్శన నిర్వహించినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ విటులను ఆకర్షించే రీతిలో రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ప్రజాప్రతినిధులను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తమ పార్టీలో చేర్చుకుని రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తమ తలుపులు ఎపుడూ తెరిచే ఉంటాయని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బీజేపీ నేతలు వారు నమ్మే హిందూ వివాహ చట్టం ప్రకారం భార్యకు మొదట విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవచ్చని అలాగే పార్టీ మారే ప్రతినిధులు ముందు వారు తమ పదవులకు రాజీనామాలు చేసిన తర్వాతనే బీజేపీలో చేర్చుకోవాలని అన్నారు. అర్ధబలంతో సీఎం కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని , ప్రతిపక్ష పార్టీ అనేదే లేకుండా పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ హిట్లర్ పాలన ఇస్తుంటే రాష్ట్రంలో కేసీఆర్ నిజాం పాలన అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇరువురూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య దేశం కావాలని ఒకపుడు ప్రజలు ఉద్యమించారని, కానీ నేడు రాజరిక పాలన నుండి ప్రజాస్వామ్యపాలన కావాలని మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్య, లౌకిక వాదులు బలమైన ఉద్యమాలు చేసి ప్రజా హక్కులను, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని నారాయణ పిలుపునిచ్చారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ వంద మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు వీ రామనర్సింహరావు, రాష్ట్ర సమితి స భ్యులు బీ వెంకటేశం, ఎస్ ఛాయాదేవి, ఎం నర్సింహ, గెల్వయ్య, చంద్రమోహన్‌గౌడ్, నేర్లకంటి శ్రీకాంత్, రాకేష్‌సింగ్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ముంపు బాధితులను ఆదుకోండి: చాడ
మిడ్‌మానేరు జలాశయంలో ముంపునకు గురవుతున్న చీర్లీవంచ గ్రామంలోని 210 మందిని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల వట్టెం రిజర్వాయిర్ ముంపు బాధితులకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు తరహాలోనే పరిహారం అందించాలని , ప్యాకేజీ చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖలు రాశారు.