తెలంగాణ

ప్రతిపైసా లెక్క చెప్పాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: తెలంగాణలో బహుళార్థక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు చేసిన ప్రతిపైసా లెక్కచెప్పాలని, దీనిపై కేసీఆర్ శే్వతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా యజ్ఞయాగాల పేరుతో కాలయాపన చేయడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం విద్యార్థలు నానాయాతన పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో బీరాలు పలికిన కేసీఆర్ ప్రధాన మంత్రికి ముఖం చూపింలేకపోతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెప్పడంలో నిజాలు దాచారన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఫెడరల్‌ఫ్రంట్ అంటూ తిరిగిన కేసీఆర్‌కు తన సొంత ఇలాఖాలో పరాజం చెందడంతో జనానికి ముఖం చాటేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావగా ఆయన అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతల సంఖ్య తగ్గిపోతోందన్నారు.
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానకి సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో కేడర్‌ను పటిష్టం చేయాలన్నారు. తెలంగాణలో జూలై 6వ తేదీ నుంచి డిసెంబర్ వరకు సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలని పార్టీ నేతల్ని ఆదేశించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని సభ్యత్వం బీజేపీకి ఉందన్నారు. దేశంలో 11 కోట్ల సభ్యత్వం కల్గిన ఏకైక పార్టీ బీజేపీదేనని ఆయన గుర్తు చేశారు. దేశంలో 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క పార్లమెంట్ స్థానం దక్కలేదన్నారు. అదే బీజేపీకి అఖండ మెజార్టీ దక్కిందన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ పాగా వేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి రాహుల్ గాంధీ ముందకు రాలేకపోయారన్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళారని అయితే ఆయన భారత్‌కు తిరిగివస్తారా అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మీడియా సమావేశానికి ముందు బీజేపీలోకి లంబాడీకి చెందిన నేతలకు లక్ష్మణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.