తెలంగాణ

ఆధ్యాత్మిక భావాలు పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూన్ 18: ప్రజలు ఆధ్యాత్మిక భావాలను పెంచుకోవాలని హంపీ పిఠాధిపతులు హింపీవిరూపాక్ష విద్యారణ్యభారతీస్వామి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లోని సత్యదేవ సహిత అయ్యప్పస్వామి దేవాలయంలో చతుర్ధ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకోని మంగళవారం శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న విద్యారణ్యభారతీస్వామి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ప్రవచనం గావించారు. ప్రతి ఒక్కరూ భక్త్భివాలు పెంచుకోవాలన్నారు. భక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. పూర్వం దేవాలయాలు ఐదు రకాలుగా ఉపయోగపడేవన్నారు. విద్యాలయం, వైద్యాలయం, జ్ఞానాలయం, గ్రంథాలయం, వాయలయంగా ఉపయోగపడేవన్నారు. ఇప్పటి ప్రజలు కూడా దేవాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రత్యక్షంగా కనిపించే సూర్య భగవానుడిని ఆదివారం పూజించినట్టయతే ఆరాధన చేసిన వారికి అనేక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. భక్తులకు తీర్ధప్రసాద వితరణ, అన్నదానం చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బొబ్బిళ్ల మురళి, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, వెన్‌రెడ్డి రాజు, దాచపల్లి ప్రకాష్, ఉప్పు భద్రయ్య, కాంశెట్టి భాస్కర్, చింతల సాయిలు, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, మంచికంటి భాస్కర్, కాంశెట్టి చంద్రశేఖర్, సముద్రాల సత్యం, సుక్క సుదర్శన్, తూర్పాటి శంకర్, అంతటి రాము, అనిల్, శ్రీశైలం, డేగేశ్వర్‌రావు, బొడ్డు రాజేందర్‌రెడ్డి, సుర్వి గణేష్, గార్లపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.