తెలంగాణ

ముంపు బాధితుల సమస్య పరిష్కరించకుంటే సిఎం ఫాంహౌస్‌ను ముట్టడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 25 : మెదక్ జిల్లాలో మల్లన్నసాగర్ ముంపు బాధితుల సమస్యపై ప్రభుత్వం 15 రోజుల్లో స్పష్టత ఇవ్వకుంటే గజ్వేల్ నియోజకవర్గంలోని సిఎం ఫాంహౌస్‌ను భూ నిర్వాసితులతో కలసి ముట్టడిస్తానని తెలుగుదేశం పార్టీ శాసనసభ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పోలీసులు మొ దటి లాఠీ దెబ్బకైనా, తూటాకైనా తాను, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి ముందుంటామన్నారు. పోలీసులతో కలసి ఉద్యమాన్ని అణచివేయలనుకోవటం భ్రమ అని.. రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం విధానాలు, సిఎం కెసిఆర్, హరీశ్‌రావుపై రేవంత్‌రెడ్డి నిప్పు లు చెరిగారు. శనివారం మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముంపు బాధితులకు పోరాటానికి మద్దతుగా టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ 48 గంటల దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. ముంపు బాధితులకు న్యాయం చేసుకోమా? అని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ అధికారులతో ముంపు బాధితులతో ఏటిగడ్డ కిష్టాపూర్‌లో చర్చా వేదిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పక్షాన మీరు..ప్రజల పక్షాన తాను చర్చిస్తామన్నారు. 123 జివో వల్ల కలిగే ప్రయోజనాలపై మీరు వివరిస్తే..2013 చట్టం ప్రకారం కలిగే లాభాలపై తాను వివరిస్తానన్నారు. ప్రజలే అంతిమంగా 123 జీవో కావాలో..2013 చట్టం ప్రకారం పరిహారం కావాలో నిర్ణయించుకుంటారన్నారు. 70 శాతం ప్రజలు అమోదిస్తే 2013 చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు పరిహారం ప్రకటించి భూ సేకరణ చేయాలన్నారు. నిర్వాసితులు న్యాయం కోసం ఉద్యమిస్తే పోలీసులతో దాడులు చేయించి అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలేదని పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సిఎం మల్లన్నసాగర్‌ను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ముంపు బాధితుల పక్షాన తానున్నానని, దమ్ముంటే కెసిఆర్, హరీశ్‌రావు కిష్టాపూర్‌కు రావాలని తేల్చుకుందామని సవాల్ విసిరారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు 10 జిల్లాల్లో పర్యటించడం కాదని, ముంపు గ్రామాల్లో పర్యటించి నచ్చచెప్పి ఒప్పించాలన్నారు. మల్లన్నసాగర్ కట్టాలన్నవారు వారి సొంత భూముల్లో నిర్వాసితులకు సగంభూమి ఇవ్వాలని, అప్పుడే బాధితుల నొప్పి తెలుస్తుందన్నారు. మా నాన్న నిర్వాసితుడే, మేము వలసవచ్చామని కెటిఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మీవి వలస బతుకులేనని, సిరిసిల్లకు నీవు, గజ్వేల్‌కు మీ నాన్న, సిద్దిపేటకు బావ హరీశ్ వలస వచ్చారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ సునంద, పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ పాల్గొన్నారు.

చిత్రం ఏటిగడ్డకిష్టాపూర్ దీక్షలో మాట్లాడుతున్న టిడిఎల్పీ నేత రేవంత్‌రెడ్డి