తెలంగాణ

కేసీఆర్‌తో ఉత్తమ్ మ్యాచ్ ఫిక్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 20: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వరుసగా రెండోసారి ఓటమిపాలవ్వడానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి కుంతియాల నిర్ణయాలే కారణమని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే సరైన ప్రత్యామ్నాయమని మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన నల్లగొండలో విలేఖరులతో మాట్లాడుతూ తనకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీస్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పిదప పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఉత్తమ్ రాజీనామా చేయలేదని, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనైనా అధిష్టానం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకుండా తప్పు చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పీసీసీకి కొత్త నాయకత్వాన్ని ఇచ్చి ఉంటే 12 సీట్లూ గెలిచేవారమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీసే నిర్ణయాలతో తప్పులు చేసిన కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం తనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి మరో తప్పు చేసిందన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని, చంద్రబాబునాయుడిని తెలంగాణకు తీసుకొచ్చి ప్రచారం చేయించి చేసిన తప్పులతో పాటు ఉత్తమ్ నాయకత్వ వైఫల్యంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని రెండోసారి కూడా ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారన్నారు. రాష్ట్ర నాయకత్వం లోపంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పతనమైందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నాడంటూ రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్, మైహోమ్ రామేశ్వర్‌రావులతో ఉత్తమ్ నిత్య సంబంధాలు కొనసాగిస్తున్నాడన్నారు. ఉత్తమ్‌ను తప్పిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ బాగుపడుతుందన్నారు. తాను షోకాజ్ నోటీస్‌కు సమాధానం ఇవ్వబోనని, షోకాజ్ నోటీస్‌ను వారే వెనక్కి తీసుకోవాలని, తాను వాస్తవాలే చెప్పానని ఇందుకు తనను అభినందిస్తూ వేలాది మంది కార్యకర్తలు ఫోన్‌లు చేశారన్నారు. తనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులకు ప్రజలు, కార్యకర్తలు షోకాజ్ ఇచ్చి గాంధీభవన్ నుండి తరిమేస్తారన్నారు. తాము ఎన్నోసార్లు పార్టీ సమావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చాలని కోరినా పట్టించుకోకపోవడంతోనే పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయిందని, భవిష్యత్‌లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. కుంతియాకు పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసే సామర్ధ్యం లేదని తాను గతంలో సైతం చెప్పానన్నారు.
ప్రజాక్షేత్రంలో పోరాడకుండా ఉత్తమ్, కుంతియాలు గాంధీభవన్‌లో, హోటళ్లలో కూర్చోని నిర్ణయాలు తీసుకోవడంతోనే రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందని, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడానికి కారణమైందన్నారు. వైఎస్.జగన్‌లు, ప్రధాని మోదీలు ప్రజల్లో తిరిగి పోరాడినందునే వారు భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారన్నారు.
వార్డు మెంబర్‌గా సైతం
గెలవలేని వీహెచ్ విమర్శలా?
గాంధీభవన్‌లో కూర్చుని వార్డు మెంబర్‌గా సైతం గెలువలేని వీహెచ్ హనుమంతరావుకు తమను విమర్శించే స్థాయి లేదన్నారు. తాము గెలుస్తామన్న నమ్మకంతోనే కాంగ్రెస్ అధిష్టానం తమకు టికెట్లు ఇచ్చిందని, వీహెచ్ గెలుస్తారనుకుంటే ఆయనకు ఇచ్చేవారన్నారు. 2014 ఎన్నికల్లో వీహెచ్‌కు డిపాజిట్ కూడా దక్కలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలు చేసే వారు కాదని, అలాగే ఉంటే వెంకట్‌రెడ్డి ఆనాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎదిరించి 2014లో మంత్రిపదవికి రాజీనామా చేసేవారుకాదని, తాను కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి పార్లమెంట్‌లో తెలంగాణ సాధన కోసం పోరాటం చేసేవారం కాదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడే శక్తి కాంగ్రెస్‌కు లేదని, కేసీఆర్‌ను గద్దె దించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం పట్ల నమ్మకంతో ఉన్నారన్నారు. తాను పార్టీ మార్పుపై కార్యకర్తలతో చర్చిస్తున్నానని ఒకటి రెండు రోజుల్లో తన భవిష్యత్ రాజకీయ నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు.