తెలంగాణ

ప్రాజెక్టు రిపోర్టును బయటపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: మల్లన్న సాగర్‌కు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)ను వెంటనే ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రోఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద ముంపు నివారణకు వీలున్న మార్గలను పరిశీలించాలని సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని కోరారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై నిపుణల కమిటీని నియమించి అధ్యయనం చేయాలని కోరారు. మల్లన్న సాగర్ రీ డిజైనింగ్ అవకాశాలను పరిశీలించాలని, అప్పటి వరకు ప్రాజెక్టు సర్వే పనులు, భూ సేకరణ పనులను నిలిపివేయాలని కోరారు.
సస్పెన్షన్ అన్యాయం
సస్పెండ్ చేసిన ఇద్దరు జడ్జీల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తి వేయాలని, హైకోర్టు విభజనతోనే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని కోదండరామ్ తెలిపారు. న్యాయాధికారులు కేటాయింపుపై న్యాయం కోసం ఆందోళన చేసిన న్యాయాధికారులను సస్పెండ్ చేయడం సరికాదని అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి కేటాయించిన నాలుగవ తరగతి ఉద్యోగులందరినీ వెంటనే తెలంగాణకు రప్పించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో జెఎసి నాయకులు పిట్టల రవీందర్, కె రఘు, నల్లపు ప్రహ్లాద్, వెంకట్‌రెడ్డి, బైరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.