తెలంగాణ

న్యాయవాది హత్య కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: రంగారెడ్డి జిల్లా కీసరలో జరిగిన న్యాయవాది ఉదయ్‌కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. న్యాయవాది ఉదయ్‌కుమార్ తన కారుతోపాటు సజీవంగా దహనమైన విషయం తెలిసిందే. భూ వివాదంతోనే ఈ హత్య జరిగినట్టు సోమవారం పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో లోకేష్‌బాబు, సుమన్‌రెడ్డి అనే నిందితులను అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లోని 5ఎకరాల భూ వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. రెండు నెలలుగా ఉదయ్‌కుమార్, లోకేశ్ మధ్య వివాదం కొనసాగుతోందని, కారులో వున్న ఉదయ్‌కుమార్‌ను హత్య చేసి నిప్పంటించే సమయంలో నిందితుడు లోకేశ్‌కు గాయాలయ్యాయని మల్కాజ్‌గిరి జోన్ ఇన్‌చార్జి డిసిపి రామచంద్రారెడ్డి తెలిపారు.