తెలంగాణ

ఆ భవనాన్ని కూల్చేయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా నిర్మితమవుతున్న అక్రమ కట్టడాలపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కె.పి. వివేకానందకు చెందిన ఇంటి భవనంలో అక్రమంగా, మంజూరీ ఇచ్చిన ప్లాన్‌ను అతిక్రమించి నిర్మించిన భాగాన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దిలిప్ బి. భోంస్లే, జస్టిస్ పి. నవీన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించింది. గత ఏప్రిల్ 26వ తేదీన కెఎం ప్రతాప్ అనే వ్యక్తి ఎమ్మెల్యే వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులు నిబంధనకు విరుద్దంగా అతి పెద్ద కమర్షియల్ నిర్మాణం చేపట్టారంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించటం, యజమానులు క్రమబద్ధీకరణ కోసం పెట్టుకున్న దరఖాస్తును కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే! ఆ తర్వాత అక్రమంగా నిర్మించిన భాగంలో కొనసాగుతున్న నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. మూడు నెలల్లోగా ఏడ్యుకేషన్ సొసైటీ ఈ భవనాన్ని ఖాళీ చేయాలని, ఆరు నెలల్లో జిహెచ్‌ఎంసి గానీ, లేక అక్రమంగా నిర్మించిన యజమానులు గానీ కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది.
సాక్షి పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ సాక్షి మీడియా గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సాక్షి మీడియా దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వం న్యాయస్థానం ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ, ప్రభుత్వం కాని, పోలీసులు కాని సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయమని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొంది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎ వి శేషసాయి ప్రభుత్వ అఫిడవిట్‌ను పరిశీలించి సాక్షి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు.