తెలంగాణ

నగరంలో అఖిలపక్షం భిక్షాటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల పక్ష నేతలు ఎద్దేవా చేశారు. తామే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొంటూ చార్మినార్ వద్ద అఖిలపక్ష నేతలు భిక్షాటన ప్రారంభించారు. దాంతో పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. పోలీసుల తీరు, ప్రభుత్వ తీరు దారుణమని అత్యంత హేయమైన చర్య అని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్ నేతలు శనివారం నాడు చార్మినార్ వద్ద భిక్షాటన చేపట్టారు. భిక్షాటన చేయడానికి బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అఖిలపక్ష నేతలకు మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. అఖిలపక్ష నేతలు చాడ వెంకటరెడ్డి, టీడీపీ నుండి ఎల్ రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, టీజేఎస్ నుండి కోదండరాం, కాంగ్రెస్ నుండి అంజన్‌కుమార్ యాదవ్, వినోద్‌రెడ్డి, ఈటీ నర్సింహతో పాటు పలువురు నేతలను అరెస్టు చేసి ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ బోర్డు, గ్లోబరీనా తప్పిదాల వల్ల తెలంగాణలో 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం జరిగిందని అన్నారు. వారే సజీవంగా ఉంటే చదువుకుని ఉద్యోగాలు పొంది ఆయా కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునే వారని , కానీ ప్రభుత్వ తప్పిదంతో వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబ సభ్యులు ఎన్నో మార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా కనీస మానవత్వంతో ఆలోచించడం లేదని అన్నారు. ఇంత జరిగినా ఈ అంశంపై ప్రభుత్వం మాట్లాడకపోవడం చూస్తుంటే , సీఎం వైఖరి చూస్తుంటే నియంతలా ఉందని అన్నారు. అరెస్టయిన నేతల్లో సృజన, పి కళావతి, ఛాయాదేవి, పీ గెల్వయ్య, అనిల్, వలీ ఉల్లాఖాద్రి, అశోక్ స్టాలిన్, ఆర్‌ఎన్ శంకర్, రాకేష్‌సింగ్, ఎన్ శ్రీకాంత్ తదితరులున్నారు.
చిత్రం...అఖిలపక్ష నేతలను అడ్డుకుంటున్న పోలీసులు