తెలంగాణ

స్నానాల గదిలో ప్రసవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూలై 7: మానసిక పరిస్థితి సరిగా లేని యువతిని లోబర్చుకుని, చాటుమాటుగా ఆమెతో శారీరకంగా సంబంధం పెట్టుకోవడంతో గర్భం దాల్చిన యువతి బాత్ రూమ్‌లోనే ప్రసవించిన ఉదంతం వెలుగు చూసింది. ఆదివారం సిరిసిల్ల మండలం చిన్న బోనాల మున్సిపల్ విలీన గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో ప్రసవించిన కొద్ది క్షణాలకే ఆడ శిశువు మృతి చెందింది. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ చౌదరి వెంటనే బాధితురాలిని సిరిసిల్లలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న బోనాలలో ఇండ్ల దేవలక్ష్మి (22) అనే యువతి 7వ తరగతి వరకు చదువుకుని, ఇంటిలోనే ఉంటోంది. ఆమె మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో అమాయకంగా ఉండడాన్ని ఆసరా చేసుకున్న గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే ముత్యాల రాజు (26) అనే యువకుడు ఆమెను లోబర్చుకుని గర్భవతిని చేశాడు. తల్లి తండ్రులు కూడా దీనిపై ఏమి చేయాలో పాలు పోని స్థితిలో ఉండగా దేవలక్ష్మికి ఏడు నెలల గర్భం పెరిగింది. ఈ స్థితిలో ఆదివారం దేవలక్ష్మి స్నానం చేయడానికి బాత్ రూమ్‌కు వెళ్ళిన సమయంలో అందులోనే ఆడ శిశువును ప్రసవించింది. కొద్ది క్షణాలకే ఆ శిశువు మృత్యువాత పడింది. రాజును విచారించి బాధితురాలికి న్యాయం జరిగేలా చట్టపరంగా వ్యవహరిస్తామని, అందుకు కారణమైన రాజు న్యాయం చేయడానికి ముందుకు రాని పక్షంలో కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస చౌదరి వెల్లడించారు. బాధితురాలు దేవలక్ష్మిని సిరిసిల్లలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్టు వెల్లడించారు.

చిత్రం...జన్మించిన కొద్ది క్షణాలకే మృతి చెందిన ఆడ శిశువు