తెలంగాణ

కమీషన్ల కోసం కేసీఆర్ కుటుంబం కక్కుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూలై 7: కేంద్రంలోని తమ ప్రభుత్వం ఆవాస్ యోజన కోసం నిధులు మంజూరు చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను కమీషన్‌లు వచ్చే ప్రాజెక్ట్‌ల కోసం మళ్లిస్తున్నారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లాలో జరిగిన బీజేపీ సభ్వతాల నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో పథకాలు అందిసున్నా వాటిని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని, కేసీఆర్ కుటుంబం కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతోందని ఆరోపించారు. మొన్నటి బడ్జెట్‌లో తెలంగాణకు 20 వేల కోట్లు నేరుగా, మిగతా 15 వేల కోట్లు ఇతర గ్రాంట్ల ద్వారా కేంద్రం ఇస్తోందని అన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలతోనైనా టీఆర్‌ఎస్ సర్కార్ బుద్ధి మారాలని అన్నారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతుల ఇబ్బందులు తీర్చే రోజు దగ్గరకు వచ్చిందని, ఆ సమస్య తీర్చిన రోజు టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నెత్తిపై తడిగుడ్డవేసుకుని కూర్చోవాలని ఎద్దేవా చేశారు. తమ బాధ్యతను టీఆర్‌ఎస్ పార్టీ గుర్తుచేసే రోజు జీవితంలో రాదని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పథకం ఆయుష్మాన్‌భవ అని దీన్ని టీఆర్‌ఎస్ సర్కార్ అసలు పట్టించుకోలేదని అన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ కోసం కేంద్రమే నిధులు ఇస్తుందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలుసని అన్నారు. 70 సంవత్సరాల అవినీతిని తొలగించడానికి నిఖార్సయిన ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టిసారించనుందని, అమిత్‌షా హైదరాబాద్ పర్యటనలో దీనిపై స్పష్టమైన సాంకేతాలు ఇచ్చారని అన్నారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకురాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, బీజేపీ నాయకులు డాక్టర్. మర్రి రాంరెడ్డి, తేలుశ్రీను, పోతంగల్ కిషన్‌రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన
చిత్రం...మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్