తెలంగాణ

బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై నోరు మెదపరెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల పక్ష నాయకులు నోరు ఎందుకు మెదపలేదని టీఆర్‌ఎస్ నిలదీసింది. బీజేపీకి నలుగురు ఎంపీలు ఉండి, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అమిత్‌షా దృష్టికైనా ఎందుకు తీసుకరాలేదని టీఆర్‌ఎస్ మండిపడింది.
టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపించిందని విమర్శించారు. అయినా తెలంగాణ ప్రతిపక్ష నాయకులు ఈ విషయాన్ని మాట్లాడటం లేదు ఎందుకని విమర్శించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై గొంతెత్తింది ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు కేంద్రం నయా పైసా ఇవ్వలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం చేతగాని ప్రతిపక్ష నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారన్నారు. మరీ బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయరా? అని బాల్క సుమన్ ప్రశ్నించారు.
పనిపాట లేకుండా ప్రభుత్వంపై అసహనంతో ఉన్నవాళ్లే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌లో ఇంతకాలం ఉన్న ఒక నేతనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియకనే రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. అవగాహన లేని వాళ్లే కొత్త సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. అసెంబ్లీని కూలగొడుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని కూడా కూల్చాలని మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రతిపాదించారని సుమన్ గుర్తు చేశారు. గుజరాత్ అసెంబ్లీ భవనాన్ని కూడా 2018లో 131 కోట్లతో ఆధునీకరించారన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీలు అలాయ్... బలాయ్ చేసుకున్నాయని విమర్శించారు. బీజేపీపై ఒకవైపు రాహుల్‌గాంధీ పోరాడుతుంటే, తెలంగాణలో మాత్రం ఆ పార్టీ నాయకులు బీజేపీతో అంటకాగుతున్నారని సుమన్ ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేశాయని ఆరోపించారు. సచివాలయ నిర్మాణాన్ని ప్రతిపక్ష నాయకులు తప్ప ఉద్యోగులు ఎవరు వ్యతిరేకించడం లేదన్నారు.